మెగా హీరో సినిమాకి భలే టైటిల్ పెట్టాడే.. ఆసక్తిగా మారిన క్రిష్ చిత్రం
Samsthi 2210 - December 3, 2020 / 09:06 AM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తెరకెక్కుతున్నాయి. ఇందులో ఒకటి క్రిష్- వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సమ్మర్ కంటే ముందే ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన `కొండపొలం` నవల ఆధారంగా రూపొందింది. చిత్రంలో కథనాయికగా నటించిన రకుల్ తొలిసారి డీ గ్లామర్ లుక్‌లో కనిపించనుంది.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొండ పొలం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నవల పేరునే సినిమా పేరుగా పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇది చిత్ర కథకు కూడా మంచిగా యాప్ట్ అవుతుందని అనుకుంటున్నారట. ప్రతి సినిమాని తక్కువ రోజులలో పూర్తి చేసే క్రిష్ ఈ చిత్రాన్ని కేవలం 45 రోజులలో పూర్తి చేశాడట. కరోనా, భారీ వర్షాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి చిత్ర షూటింగ్ పూర్తి చేసాడు.
క్రిష్- వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రంకి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ వికారాబాద్ అడవులలోనే జరిగింది. ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు అనుకున్న టైంకు చిత్రీకరణ పూర్తి చేశారు. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నారు. రాబర్ట్ హుడ్ నేపథ్యంలో ఈ మూవీ చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య పవన్ బర్త్‌డే సందర్భంగా ప్రీ లుక్ విడుదల చేయగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇక ఇదిలా ఉంటే మెగా హీరో, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు.