Adipurush: ఆదిపురుష్‌పై ఆస‌క్తిక‌ర‌ అప్‌డేట్.. వైర‌ల్‌గా మారిన వార్త‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఇతిహాస కావ్యం ఆదిపురుష్‌. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనే భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా రాముడిగా నటిస్తుండగా, ఆయ‌న స‌ర‌స‌న సీతగా కృతి సనన్ నటించబోతోంది.

లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. మరో ముఖ్యపాత్ర కోసం సీనియర్ హీరోయిన్ కాజోల్‌ని తీసుకున్నారని సమాచారం. ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్‌కు షిఫ్ట్ కాగా, ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మేఘనాథుని పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాను అనుకుంటున్నారని టాక్ వైరల్ అవుతుంది. ఈ వార్త‌తో మూవీపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.