Sunil: సునీల్ లైఫ్ లో ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

sunil

Sunil: కమెడియన్ గా టాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్.. హీరోగానూ అలరించాడు. మొదట విలన్ అవుదామని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సునీల్ కమెడియన్ గా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అనతి కాలంలోనూ మంచి కమెడియన్ గా పేరుతెచ్చుకున్నాడు. నువ్వేకావాలి సినిమా సునీల్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. సునీల్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పుట్టి పెరిగాడు. చిన్న వయసులోనూ తండ్రి ని కోల్పోయిన సునీల్ ను తల్లి పెంచి పెద్ద చేసింది. సునీల్ కి సినీ పరిశ్రమలోకి రాకముందే పెళ్లైంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసున్నాడు. సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి, సునీల్ దంపుతలకు ఒక పాప, బాబు ఉన్నారు.

Interesting facts about comedian sunil సునీల్
Interesting facts about comedian sunil

మెగాస్టార్ అంటే పడి చచ్చే సునీల్.. మంచి డ్యాన్సర్ కావాలని అనుకున్నాడు. నటన మీద ఉన్న ప్రేమతో హైదరాబాద్ వచ్చాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్పీ పట్నాయక్ సునీల్ రూమ్ మేట్స్. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. విలన్ అవుదామని వచ్చినా కమెడియన్ గా అవకాశం దొరికింది. ఆ తర్వాత కమెడియన్ గా సక్సెస్ అయ్యాడు. మాస్ సినిమాలో నాగార్జునకు తమ్ముడిగా నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించి మెప్పించాడు. తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు. అందాలరాముడుగా హీరోగా తనలోని మరో కోణాన్ని చూపించాడు. అందాలరాముడులో హీరోగా చేస్తూనే.. కామెడీ పండించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అందులో సునీల్ డ్యాన్సులు అదరగొట్టాడు. అన్ని పాటలు హిట్ అయ్యాయి.

వరుసగా హీరోగా ఆఫర్లు వచ్చాయి. హీరోగానే చేయాలని నిర్ణయించుకున్న సునీల్.. మర్యాద రామన్న, పూల రంగడు.,తడాఖా వంటి సినిమాల్లో నటించాడు. అవన్నీ సూపర్ హిట్ కావడంతో సునీల్ హీరో పాత్రలనే చేయాలనుకున్నాడు. తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు సిద్దమయ్యాడు. సునీల్ ప్రస్తుతం వేదాంతం రాఘవయ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అటు కొన్ని పెర్ఫామెన్స్ కు ఆస్కారమున్న పాత్రలనూ చేస్తున్నాడు.

Advertisement