Bigg Boss: నెత్తికెక్కిన పొగ‌రు.. సెల‌బ్రిటీల్లా ఫీల‌వుతున్న కొంద‌రు బిగ్ బాస్ కంటెస్టెంట్స్

Bigg Boss: బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్ష‌కులకి మంచి వినోదం పంచుతూనే కొంద‌రు కంటెస్టెంట్స్‌ని ఓవ‌ర్‌నైట్ స్టార్స్‌ని చేస్తుంది.ఈ షో వ‌ల‌న చాలా మంది కంటెస్టెంట్స్ కెరియ‌ర్ జెట్ స్పీడ్‌తో సాగుతుంది. అయితే సీజ‌న్ విన్న‌ర్‌గా నిలిచిన వారు చాలా ప‌ద్ద‌తిగా ముందుకు సాగుతూ త‌మ కెరియ‌ర్‌ని బిల్డ‌ప్ చేసుకుంటుండ‌గా, టాప్ 5లో నిలిచిన కొంద‌రు మాత్రం పొగ‌రు నెత్తికెక్కిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. హౌజ్‌లోకి వెళ్ల‌క ముందు బాబు బాబు అనుకుంటూ అంద‌రి వెన‌క తిరిగిన వారు ఇప్పుడు ఎవ‌రిని ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేర‌ట‌.

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ముగిసినప్పటికీ కంటెస్టెంట్ల హడావుడి మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఫినాలేలో అడుగుపెట్టిన కొంద‌రు ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్‌ మీట్‌, గెట్‌ టు గెదర్‌ అంటూ తెగ సందడి చేస్తున్నారు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం తనకు అండగా నిలబడ్డవాళ్లను కనీసం పట్టించుకోవట్లేదన్న విమర్శలు మొదలయ్యాయి.

వారి విజ‌యంలో కీలక పాత్ర పోషించిన స‌పోర్ట‌ర్స్ వంక తలెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ అభిమాన కంటెస్టెంట్ కోసం ఎంతగానో పోరాడిన వారికి కనీసం కృతజ్ఞతలు చెప్ప‌క‌పోగా, లైట్‌గా తీసుకుంటున్నార‌ట‌. వారి తలబిరుసును కొంద‌రు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. బిగ్ బాస్ షోతో వ‌చ్చిన క్రేజ్ చూసి ఎగిరెగిరి ప‌డుతున్నారు. ఇదంతా మున్నాళ్ల మురిపెం అనే విష‌యం వారు మ‌ర‌చిపోతున్నారు. గెలుపు కోసం ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన స‌పోర్ట‌ర్స్‌కి మీరిచ్చే విలువ ఇదేనంటూ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Inside Talk Bigg Boss Telugu Contestants Overaction
Inside Talk Bigg Boss Telugu Contestants Overaction

బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్ల‌క ముందు ప్ర‌మోష‌న్స్ కోసం కాల్ చేసిన వారు ఇప్పుడు ముఖం కూడా చూడ‌టం లేద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. న‌లుగురు వ‌చ్చి ఫొటోలు అడిగితే సో కాల్డ్ సెల‌బ్రిటీల్లా ఫీల్ అవుతున్నారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.ఇండ‌స్ట్రీలో రాణించాలంటే ఇలాంటి త‌ల పొగ‌రు వేషాలు అస్స‌లు ప‌నికి రావు అన్న‌వాళ్లు లేక‌పోలేదు.

అంద‌రికి ఒక టైం వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేస్తాం అంటూ కొంద‌రు కూల్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కాస్త పాపులారిటీ వ‌చ్చింద‌ని ఎప్పుడు ఎగ‌రకూడ‌దు, అది ఏదో ఒక రోజు చేటు చేస్తుంది. ఇప్ప‌టికైన మారి అంద‌రితో సన్నిహితంగా ఉంటే మంచిది అంటూ ప‌లువురు సున్నితంగా హెచ్చ‌రిస్తున్నారు.

ఇక బిగ్ బాస్ క్రేజ్‌ని క్యాష్ చేసుకున్న ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అమ్మాయిలతో తెగ చాటింగ్‌లు చేస్తున్నాడ‌ట‌. అంతేకాదు కొంద‌రు మ‌హిళ‌ల‌ని ట్రాప్‌లోకి దింపి వారితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. బిగ్ బాస్ వ‌ల‌న వ‌చ్చిన క్రేజ్‌ని ఇలా దుర్వినియోగం చేసుకుంటున్న వారు జీవితంలో అందుకు తగ్గ శిక్ష త‌ప్ప‌క అనుభ‌విస్తారు అని దుమ్మెత్తిపోస్తున్నారు.

Inside Talk Bigg Boss Telugu Contestants Overaction
Inside Talk Bigg Boss Telugu Contestants Overaction

గ‌తంలో కొంద‌రు త‌మ‌కు ద‌క్కిన పాపులారిటీని ఉప‌యోగించుకొని చాలా మంది అమ్మాయిల జీవితాల‌ని నాశ‌నం చేశారు. వారి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో జైల్లో ఊచ‌లు లెక్క‌పెట్టిన ప‌రిస్థితులు కూడా మనం చూశాం. మ‌రి గ‌త ప‌రిస్థితుల‌ని చూసైన ప‌ద్ద‌తిగా, న‌లుగురికి ఆద‌ర్శంగా ఉంటే అంతా సాఫీగా సాగుతుంద‌ని ప‌లువురు సూచ‌న‌లు చేస్తున్నారు.