INDUVADANA: బోల్డ్ మూవీతో రాబోతున్న వ‌రుణ్ సందేశ్‌.. అంచ‌నాలు భారీగా పెంచిన ఫ‌స్ట్ లుక్

హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన న‌టుడు వ‌రుణ్ సందేశ్. ఈ రెండు సినిమాలు త‌ప్ప వ‌రుణ్ కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ సినిమాలు లేవు. వ‌రుస ప‌రాజ‌యాలు చవిచూస్తుండడంతో కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్నారు వ‌రుణ్ సందేశ్. బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మంతో త‌న భార్య‌తో క‌లిసి రియాలిటీ షోకు హాజ‌ర‌య్యారు. ఈ షో ద్వారా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు వ‌రుణ్‌. అయితే కొన్నాళ్లుగా సినిమా ట్రైల్స్ లో ఉన్న వ‌రుణ్ తాజాగా త‌న మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.

తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్‌లో నాయకానాయికల బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కు గురి చేస్తుంది. గ‌తంలో ఇలాంటి సినిమాలు వ‌రుణ్ చేయ‌క‌పోగా, ఈ సినిమా పోస్ట‌ర్ స‌రికొత్త అంచ‌నాలు పెంచుతుంది. పంచెకట్టు దోతీ.. మెడలో రుద్రాక్ష మాల.. ఇదంతా చూస్తుంటే అతడు క్లాసిక్ సినిమా చేస్తున్నాడా అనే భావ‌న క‌లుగుతుంది. ఇద్ద‌రు ప్రేమ‌ప‌క్షులు కౌగిలిలో బందీ కాగా,వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ పీక్స్‌లో ఉంద‌ని పోస్ట‌ర్ ద్వారా తెలుస్తుంది. ఈ చిత్రంలో ఫర్నాజ్ శెట్టి కథానాయిక కాగా, ఎం.ఎస్.ఆర్ దర్శకుడు. మాధవి ఆదుర్తి నిర్మాత.

Advertisement