Mahesh: మహేష్ సినిమా నుండి పూజా ఔట్.. స‌మంత‌ ఇన్..!

Mahesh: మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌పై అభిమానుల‌లో ఎన్ని అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో వాళ్ల ఆశలు నెరవేరుస్తూ మూడో సినిమాను ప్రకటించారు.

in mahesh movie pooja out and samantha in
in mahesh movie pooja out and samantha in

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో మహేష్, త్రివిక్రమ్ సినిమా వస్తుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలు కానుంది. సమ్మర్ 2022 టార్గెట్ పెట్టుకుని వచ్చేస్తున్నారు ఈ జోడీ. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కూడా వచ్చాయి.

ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా మరో బ్యూటీ పేరు వినిపిస్తుంది. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. సెకండ్ ఆఫ్ లో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్ త్రివిక్ర‌మ్ సినిమాలో పూజా హెగ్డేకి బ‌దులు స‌మంత‌ని ఎంపిక చేశార‌ని స‌మాచారం. పూజా కాల్షీట్స్ ఖాళీ లేవ‌నో లేదంటే ఇత‌ర కార‌ణాల వ‌లనో తెలియ‌దు కాదు క‌ని పూజా స్థానంలో స‌మంత వ‌చ్చింద‌ని అంటున్న‌రాఉ. దీనిపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో చూడాలి.

in mahesh movie pooja out and samantha in1
in mahesh movie pooja out and samantha in1

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు మరింత స్టైలిష్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.