KBC: కేబీసీలో అమితాబ్‌ని ఇంట‌ర్వ్యూ చేసిన కంటెస్టెంట్.. ఆ ప్ర‌శ్న‌కు నోరెళ్లపెట్టిన బిగ్ బీ

KBC: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈ వ‌య‌స్సులోను ఉత్సాహంగా సినిమాల‌తో పాటు ప‌లు షోస్ హోస్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అమితాబ్ హోస్ట్‌గా కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి అనే షో రూపొందుతుంది. సామాన్యులను కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మార్చే ఈ టీవీషోకు ఎంతో క్రేజ్‌ ఉంది. అందుకే ఈ రియాలిటీ షోలో పాల్గొనాలని చాలామంది కలలు కంటుంటారు.

in KBC SHOWS interview for amitabh2
in KBC SHOWS interview for amitabh2

ఇప్పటికే 12 సీజన్లను పూర్తి చేసుకున్న కేబీసీ తాజా సీజన్‌ ఇటీవల ప్రారంభమైంది. ఇక హోస్ట్‌ అమితాబ్‌ ఈ గేమ్‌షోను ఆసక్తికరంగా మలచడంతో బాగా విజయవంతమయ్యారు. కేవలం ప్రశ్నలు- సమాధానాలే కాకుండా కంటెస్టెంట్ల జీవిత విశేషాలు, వారితో సరదా సంభాషణలు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఆరాధ్య గుప్తా అనే యువకుడు తాజాగా కేబీసీ హాట్‌సీట్‌కు అర్హత సాధించాడు. ఎప్పటిలాగానే అతని జీవిత విశేషాలు తెలుసుకున్నారు బిగ్‌బీ. తనకు టీవీ జర్నలిస్ట్‌ కావాలని ఉందని ఆరాధ్య చెప్పడంతో తనను ఇంటర్వ్యూ చేయమని అమితాబ్‌ సరదాగా అడిగాడు. అప్పుడు ఆ యువకుడు.. ‘ అలెక్సా (అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్‌) కోసం మీ వాయిస్‌ను రికార్డ్‌ చేశారు కదా అని అడిగాడు.

ఇంట్లో జయా ఆంటీ.. ‘అలెక్సా.. స్విచ్ ఆన్ ది ఏసీ’ అని ఆర్డర్‌ వేస్తే .. ‘ యస్‌.. మేడమ్’ అని సమాధానమిస్తుందా’ అని అడిగాడు. ఈ ప్రశ్న వినగానే అమితాబ్‌ సైలెంట్‌ అయిపోయారు. కానీ గ్యాలరీల్లో ప్రేక్షకులు మాత్రం విరగబడి నవ్వారు. కొద్ది సేపటి తర్వాత తేరుకున్న బిగ్‌బీ.. ‘మా ఇంట్లో ఏసీకి అలెక్సాను కనెక్ట్‌ చేయలేదు. మాన్యువల్‌గానే ఏసీని వేసుకుంటాం’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

in KBC SHOWS interview for amitabh
in KBC SHOWS interview for amitabh

ఆతర్వాత అమితాబ్‌ను మరికొన్ని ప్రశ్నలు అడిగాడు ఆరాధ్య. బిగ్‌బీ హైట్‌ను ఆధారంగా చేసుకుని ‘ మీరు చాలా పొడవుగా ఉన్నారు కదా…ఇంట్లో మీరే ఫ్యాన్లు శుభ్రం చేస్తారా’ అని యువకుడు అడగ్గానే ప్రేక్షకుల ముఖాల్లో మళ్లీ నవ్వులు విరబూశాయి. దీనికి సింపుల్‌గా ‘లేదు’ అని చెప్పిన అమితాబ్‌.. ‘నువ్వు చాలా కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నావ్‌.. ఇక చాలు’ అంటూ షోను ముందుకు తీసుకెళ్లారు.