Suma : సుమ లేక అయోమయం.. ఇండస్ట్రీలో ఆమె ప్రాముఖ్య ఏంటో అర్థం అవుతుంది

NQ Staff - October 1, 2022 / 10:48 AM IST

Suma : సుమ లేక అయోమయం.. ఇండస్ట్రీలో ఆమె ప్రాముఖ్య ఏంటో అర్థం అవుతుంది

Suma : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఇక నాగార్జున హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించారు ఈ రెండు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు. కానీ ఒక లోటు మాత్రం కనిపించింది.

చాలా మంది యాంకర్ గా సుమ లేకపోవడంను ఓకింత తప్పు పడుతున్నారు, ఇంత పెద్ద కార్యక్రమం చేసి యాంకర్ గా సుమను తీసుకురాలేక పోయారా అంటూ విమర్శలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జున సినిమాలకే యాంకర్ సుమ డేట్లు ఇవ్వలేక పోయిందా అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్న ఈ సమయంలో ఆమె సన్నిహితుల నుండి ఒక క్లారిటీ అయితే వచ్చింది.

ఆ రెండు సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో సుమ విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేక పోయిందని వారు చెప్తున్నారు. చిరంజీవికి మరియు నాగార్జునకు సుమ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది అనే విషయంలో సందేహం లేదు. ఆమెకు కూడా వాళ్లంటే అమితమైన గౌరవం. కనుక వాళ్ళు ఆహ్వానించి ఉంటే హైదరాబాదులో ఉన్నప్పుడు ఖచ్చితంగా సుమ వెళ్ళేది.

కానీ ఆమె హాలిడే ట్రిప్ లో ఉంది కనుక ఆమె ఆ రెండు సినిమా ఫంక్షన్లకు హాజరు కాలేదు.. కనుక సుమ లేని ఆ ఫంక్షన్ వేలవేల పోయాయి.ఆ రెండు ఫంక్షన్స్ పరిస్థితి చూసిన తర్వాత ఇండస్ట్రీలో ఆమె యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమైంది. సుమ లేకుంటే ఫంక్షన్ ఆపేసుకోవాలి, ఆమె డేట్ ఇచ్చినప్పుడే పెట్టుకోవాలి అన్ని తాజా ఉదంతంతో క్లారిటీ వచ్చిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us