Ileana: ఏంది ఇలియానా.. మరీ ఇంత‌లా చూపించేస్తున్నావు..!

Ileana: ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న ఇలియానా త‌న అంద‌చందాల‌తో పాటు న‌ట‌న‌తో కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేసింది. ఈ అమ్మ‌డి న‌డుముని చూసి చాలా మంది మూర్చపోయారు. స్టార్ హీరోలంద‌రితో దాదాపు న‌టించిన ఈ ముద్దుగుమ్మ ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. ఇలియానా జోరు చూసి అప్ప‌ట్లో మిగ‌తా హీరోయిన్స్ కుళ్లుకునే వారు.

Ileana

ఇప్పుడు ఇలియానా జోరు కాస్త త‌గ్గింది. ఇటు దక్షిణాదిలో అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇక ఉత్తరాదిలో అవకాశాలు వచ్చినా కూడా సక్సెస్ మాత్రం రావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టడం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయిన ఇలియానాకు ఇప్పుడిలా అవకాశాలు లేకుండాపోయాయి..

సినిమాలు లేక‌పోయిన ప్రేమ‌, బ్రేక‌ప్, హాట్ షోల‌తో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది ఇలియానా. కరోనా, లాక్డౌన్ సమయంలోబీచ్‌లు, ఎంజాయ్‌మెంట్‌ని చాలా మిస్ అయ్యాన‌ని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగ‌మ్మ‌. అయితే ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఏదో వెకేష‌న్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా బీచ్ నుంచి ఒక క్లోజ్ సెల్ఫీని ఈ అందాల భామ షేర్ చేసింది. ఈ సెల్ఫీలో ఇల్లీ ఒరిజినల్ కలర్ ముఖఛాయ ఎలివేట్ అయ్యాయి.

ileana

ఎలాంటి మేక‌ప్ లేకుండా నేచుర‌ల్ లుక్‌లో ద‌ర్శ‌నమిచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా హాట్‌గా క‌నిపిస్తోంది. సూర్య‌కాంతిలో డీ విట‌మిన్ సేక‌రిస్తూ హాట్ షో చేస్తూ త‌న అభిమానుల‌కి చ‌లి జ్వ‌రం పుట్టిస్తుంది. ఆ మ‌ధ్య చాలా లావుగా క‌నిపించిన ఇలియానా మ‌ళ్లీ ఇప్పుడు పాత లుక్‌లోకి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. ఇటీవలే `ది బిగ్ బుల్` అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజై ఆకట్టుకుంది. తదుపరి చిత్రంగా రణదీప్ హుడా సరసన అన్ ఫెయిర్ అండ్ లవ్ లీ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.