Ileana D’Cruz : న్యూ లుక్‌లో క‌నిపించిన ఇలియానా.. ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్

Ileana D’Cruz : ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ‌ ఇలియానా. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ గోవా బ్యూటీ. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది.

TheNewsQube-
Ileana DCruz STUNNING Looks
Ileana DCruz STUNNING Looks

పోకిరి, జల్సా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లు అందుకుంది. ఇక బర్ఫీ సినిమా తర్వాత బాలీవుడ్‏లో బిజీ హీరోయిన్‏గా మారిపోయింది. అయితే బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్‏గా ఈ ముద్దుగుమ్మ .. తెలుగు చిత్రపరిశ్రమకు పూర్తిగా దూరమయ్యింది.

గత కొద్ది రోజులుగా అటు బాలీవుడ్‎లోనూ సినిమా అవకాశాలు సైతం తగ్గిపోయాయి. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌ని అల‌రిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ షార్ట్ హెయిర్‌తో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఫేస్ మాత్రం క‌నిపించ‌కుండా ప‌రుగులు తీసుకుంటూ వెళ్లింది.

లాంగ్ హెయిర్‌తో క‌నిపించే ఇలియానా ఇప్పుడు పొట్టి హెయిర్‌తో క్యూట్ లుక్‌లో మెరిసి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం నిజంగా భయాన్ని కలిగించే అంశం. ఆ సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయరు. ద్వేషించడం మొదలుపెడతారు. అసలు ఎందుకు అలా ఉన్నారో మీకే అర్థం కాదు. ఈ అంశాలు బతికుండగానే మిమ్మల్ని తినేస్తాయి అంటూ ఇలియానా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పెర్కొంది.