Ileana D’Cruz : రెజ్లర్ల పోరాటానికి మద్దతు తెలిపిన ఇలియానా.. మోడీని విమర్శిస్తూ..!
NQ Staff - May 31, 2023 / 08:14 AM IST

Ileana D’Cruz : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రెజ్లర్ల పోరాటం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ఆరు నెలలుగా ఢిల్లీలో రెజర్లు పోరాటం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ, ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమని లైంగికంగా వేధించాడని సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత లాంటి రెజ్లర్లు ఆరోపిస్తున్నారు.
వీరికి మద్దతుగా మిగతా రెజర్లు అందరూ పోరాటం చేస్తున్నారు. కానీ వారి పోరాటానికి పెద్దగా ఫలితం దక్కట్లేదు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు మిగతా స్పోర్ట్స్ వారు గానీ.. ఇతర ఆటగాళ్లు కూడా స్పందించట్లేదు.
అయితే తాజాగా ఇలియానా దీనిపై స్పందించింది. ఇప్పటి వరకు ఆమె తన పర్సనల్ విషయాల గురించి, సినిమాల గురించి మాత్రమే స్పందించేది. కానీ తాజాగా పోలీసులతో సాక్షి మాలిక్ పోరాడుతున్న పిక్ ని ఇలియానా పోస్ట్ చేసింది. ఈ ఫొటో మీద పీఎం నరేంద్ర మోడీ గతంలో సాక్షి మాలిక్ ను పొగుడుతూ చేసిన ట్వీట్ ను యాడ్ చేసింది.

Ileana D’Cruz Posted Picture Of Sakshi Malik Fighting With Police
అంటే ప్రధాన మంత్రి పొగిడిన రెజ్లర్ పరిస్థితి నేడు ఇంత దారుణంగా ఉందంటూ అర్థం వచ్చేలా ఆమె పోస్టు చేసింది. ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన పోస్టు అని అర్థం అవుతోంది. ఇక ఇలియానపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రెజర్లు తాము గెలిచిన మెడల్స్ ను గంగా నదిలో పడేయాలని డిసైడ్ అయ్యారు.