Ileana D’Cruz Birth Baby Boy : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..?

NQ Staff - August 6, 2023 / 08:49 AM IST

Ileana D’Cruz Birth Baby Boy : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..?

Ileana D’Cruz Birth Baby Boy :

గోవా బ్యూటీ ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. తాను ఆగస్టు 1న మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపింది. కొడుకు ఫొటోలను కూడా పోస్టు చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించడం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశానని చెప్పింది.

మాటల్లో చెప్పలేనంటూ..

Ileana D'Cruz Birth Baby Boy

Ileana D’Cruz Birth Baby Boy

ఇక తన కొడుకు పేరును కోవా ఫీనిక్స్ డోలన్ అని ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఇలా రాసుకొచ్చింది. మా ప్రియమైన అబ్బాయి కోవా ఫీనిక్స్ డోలన్ ను పరిచయం చేయడానికి ఎంత సంతోషిస్తున్నామో మాటల్లో చెప్పలేం అంటూ రాసుకొచ్చింది ఈ భామ. ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఆమెకు విషెస్ చెబుతున్నారు.

Ileana D'Cruz Birth Baby Boy

Ileana D’Cruz Birth Baby Boy

ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. చాలా కాలం తన ప్రియుడు ఎవరో చెప్పలేదు. కానీ గత జులై నెలలో ఆయన ఫొటోలను రివీల్ చేసింది. ఆయన విదేశీ వ్యక్తి అని తెలుస్తోంది. అతనితో డేటింగ్ చేసి పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి అయింది. మరి అతన్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us