ILEANA: ఇలియానా ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుందా.. ఆమె స్పంద‌న ఏంటి?

గోవా బ్యూటీ ఇలియానా అంటే కుర్ర‌కారు ఎంత‌గా ప‌డి చ‌చ్చిపోయేవారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. సెక్సీ లుక్‌లో క‌నిపిస్తూ అంద‌రి మ‌తులు పోగొట్టిన ఇలియానా కొన్నాళ్లు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. ఆ త‌ర్వాత మెల్ల‌మెల్లగా క‌నుమ‌రుగు అయిపోయింది. ఆ మధ్య ర‌వితేజ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా స‌రైన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఆమె మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. అయితే సోష‌ల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో ట‌చ్‌లో ఉంటూ అల‌రిస్తూ ఉండే ఇలియానా తాజాగా త‌న అబార్ష‌న్, ఆత్మ‌హ‌త్య‌పై స్పందించింది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాల‌పై మాట్లాడింది. గ‌తంలో నా పై చాలా పుకార్లు వ‌చ్చాయి. అబార్ష‌న్ చేసుకున్నాన‌ని, ఒకానొక స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోబోతే, నా ప‌ని మ‌నిషి వ‌చ్చి ఆపిందని పుకార్లు పుట్టించారు. నిజానికి నాకు ప‌ని మ‌నిషి ఎవ‌రు లేరు. సూసైడ్ చేసుకోవ‌డానికి ఏనాడు ప్ర‌య‌త్నించ‌లేదు. ఇంత దారుణ‌మా, ఇలాంటి పిచ్చి పిచ్చి వార్త‌లు ఎక్క‌డ దొరుకుతాయో అర్దం కావ‌డం లేదు అని ఇలియానా పేర్కొంది. ఆమె త‌న బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో 2018లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌లోను నిజం లేద‌ని పేర్కొంది.

Advertisement