రెడ్ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే సరిపోయేది అనసవరంగా థియేటర్స్ వరకు తెచ్చారు ..!

Vedha - January 15, 2021 / 02:50 PM IST

రెడ్ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే సరిపోయేది అనసవరంగా థియేటర్స్ వరకు తెచ్చారు ..!

రెడ్ సినిమా మీద ఇన్ని నెలలుగా ఎనర్జిటిక్ హీరో పెట్టుకున్న ఆశలన్ని ఆవిరైపోయాయి. ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలన్ని ఒక్కసారిగా తారుమారయి షాక్ తగిలింది. ఇస్మార్ట్ శంకర్ సక్సస్ తో ఫాం లోకి వచ్చిన రాం రెడ్ సినిమాతో మరో భారీ హిట్ అందుకోవాలనుకున్న ప్లాన్స్ రివర్స్ లో దెబ్బ కొట్టాయి. రాం తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు క్లాస్ సినిమాలని తీసి హిట్స్ అందుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల ఫస్ట్ టైం మాస్ ఎంటర్‌టైనర్ ని ట్రై చేసి హిట్ కొట్టాలనుకుంటే బెడిసికొట్టింది.

Ram Pothineni's Red to have a new Release Strategy

తమిళంలో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలు మన తెలుగులో సక్సస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కథలు ఇక్కడ మన హీరోలకి సెట్ కాక .. ప్రేక్షకులని మెప్పించలేక ఫ్లాప్ చూసిన హీరోలు చాలామంది ఉన్నారు. స్ట్రైట్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా గతంలో తమిళ సూపర్ హిట్ సినిమాని తెలుగులో రీమేక్ చేసి ఫ్లాప్ మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మన రాం కూడా చేరాడని అంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత చాలా కథలు విన్న రాం ఎందుకనో తడం సినిమాని రెడ్ గా రీమేక్ చేయాలని డిసైడయ్యాడు. అయితే అప్పుడు కరెక్ట్ డెసిషన్ అన్నవాళ్ళే ఇప్పుడు రాంగ్ స్టెప్ వేశాడని కామెంట్ చేస్తున్నారట. రెడ్ కథ మన వాళ్ళని ఏమాత్రం మెప్పించలేదని అందుకే రాం రెడ్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఇన్ని నెలలు వేయిట్ చేసి కూడా టైం వేస్ట్ చేసుకున్నాడని ఎప్పుడో ఓటీటీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది కాబట్టి రిలీజ్ చేసేసి ఉంటే సరిపోయి ఉండేదని అంటున్నారు. అంటే రెడ్ సినిమాని ఓటీటీ సినిమా అని డిసైడ్ చేశారనమాట. ఏదేమైనా రాం రెడ్ సినిమా గట్టి షాకిచ్చింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us