Allu Arha : త‌న కూతురు ఊహించ‌ని విధంగా బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసిన బ‌న్నీ.. ఫుల్ ఖుష్ అయిన అర్హ‌

Allu Arha : అల్లు అర్జున్ త‌న ఫ్యామిలీని ఎంతో ప్రేమిస్తుంటాడు. ముఖ్యంగా త‌న కూతురిని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె కోసం చాలా చేస్తుంటాడు. తాజాగా అర్హ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అద్భుత‌మైన గిఫ్ట్ ఇచ్చాడు. అల్లు అర్హ నవంబర్ 21న‌ఆరో వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ బర్త్‌డే వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు బన్నీ.

ICON STAR Allu Arjun Daughter Arha Birthday Celebrations
ICON STAR Allu Arjun Daughter Arha Birthday Celebrations

ఇందుకోసం ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్‌ ఖలీఫాను ఎంచుకున్నాడు. అనుకున్నదే తడవు ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు చెక్కేశాడు. బుర్జ్‌ ఖలీపాపై అర్హతో కేక్‌ కట్‌ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపాడు. ఈ భవంతిపై ఈ రేంజ్‌లో బర్త్‌డే పార్టీ జరుపుకున్న మొదటి వ్యక్తి అర్హనే అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. ప్రస్తుతం అర్హ బర్త్‌డే ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

బుర్జ్ ఖలీఫాలో సాధారణ ప్రజలు ఏవైనా సెలెబ్రేషన్స్ చేసుకోవాలంటే దాదాపు అసాధ్యం. అయితే స్టైలిష్ స్టార్ అర్హా పుట్టినరోజు సందర్భంగా భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అర్హ ఇక్కడ జరుపుకున్న మొదటి పార్టీ ఇదే. అంతేకాదు మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ జరిగిన మొదటి వేడుక కూడా ఇదే.

అల్లు అర్జున్ ట్విట్టర్‌ వేదికగా కూతురుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అర్హాతో ఉన్న బ్యూటిఫుల్ పిక్ పంచుకున్నారు. “హ్యాపీ బర్త్‌డే మై లిల్ ప్రిన్సెస్. నేను చాలా ప్రేమిస్తున్నాను బేబీ. ఈ సంవత్సరం చాలా కలరింగ్, డ్రాయింగ్ & ట్రావెలింగ్‌తో నిండిపోవాలని కోరుకుంటున్నాను” అని బన్నీ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం దుబాయ్ లో అర్హ పుట్టినరోజుకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

కాగా అర్హ ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపై అడుగు పెడుతున్న విషయం తెలిసిందే! క్రియేటివ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్హ భరతుడిగా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శాకుంత‌లగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ సందడి చేయనుంది.