Ichata Vahanamulu Nilupa Radu Review: ఇచ్చ‌ట వాహ‌నాలు నిలుప‌రాదు మూవీ రివ్యూ

Ichata Vahanamulu Nilupa Radu Review: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో సుశాంత్ కి మంచి హిట్స్ సొంతం చేసుకోలేకపోయారు. చి.ల.సౌ సినిమాలో యాక్ట్ చేయడంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో కీలక పాత్ర పోషించారు. లేటెస్ట్ గా ఇచ్చట వాహనములు నిలుపరాదు లో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..

Ichata Vahanamulu Nilupa Radu Review and Rating
Ichata Vahanamulu Nilupa Radu Review and Rating

కథ :

అరుణ్ చలాకీగా ఉంటూ అమ్మ కూచీగా ఉంటాడు. మీనాక్షి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడి హీరోయిన్ వర్క్ చేసే కంపెనీలో జాయిన్ అవుతాడు. హీరోయిన్ నరసింహా యాదవ్ చెల్లెలు. తన గర్ల్ ఫ్రెండ్ కి సర్ ప్రైజ్ ఇవ్వడం కోసం ప్లాన్ చేసిన హీరో అనుకోకుండా క్రైమ్ జరిగిన ఇంటికి వెళ్ళడం.. తాను చేయని తప్పులో ఇరుక్కోవడం జరుగుతాయి. ఈ ట్రబుల్ లో నుండి అరుణ్ ఎలా బయటపడతాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :

సుశాంత్ ఈ పాత్రలో చాలా డల్ గా కనిపిస్తారు. వెన్నెల కిషోర్ మంచి కామెడీని అందించారు. ప్రియదర్శి పులి క్యారెక్టర్ లో నటించి ఈ సినిమాకి కీలకంగా నిలిచారు. కాకపోతే ఈయన పాత్ర నిడివి చాలా చిన్నది. రవి వర్మ నెగిటివ్ రోల్ లో యాక్ట్ చేశారు. కృష్ణ చైతన్య పోలీస్ ఇన్స్ పెక్టర్ గా తన పరిది మేరకు యాక్ట్ చేశారు.

టెక్నీషియన్స్ :

టెక్నికల్ గా ఈ సినిమా దారి తప్పిందనే చెప్పుకోవాలి. దర్శన్ డైరెక్టర్ గా తన కెరీర్ లో ఫస్ట్ మూవీ ఇది. ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ని మిస్ చేసినట్లుగా ఉంటుంది. ఈ కథకు స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ ఉంటే బావుండేది. చాలా ఫ్లాట్ గా ఉండటంతో డిజప్పాయింట్ మెంట్ కలిగిస్తుంది. డైలాగ్స్ కూడా హీరోహీరోయిన్లకు సెట్ అయినట్లు ఉండదు. ప్రవీణ లక్కరాజు మ్యూజిక్ బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి అంతంత మాత్రంగానే ఉందనిపిస్తుంది.

విశ్లేషణ :

ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ తాను అనుకున్న పాయింట్ ని ఎలివేట్ చేయలేకపోయాడు. హీరో సుశాంత్ కూడా అరుణ్ పాత్రలో సరిగ్గా సెట్ అవ్వలేదనే ఫీలింగ్ వస్తుంది. ప్రేక్షకుడికి బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్ గా ఇచ్చట వాహనములు నిలుపరాదు ప్రయోగాత్మకంగానే మిగిలింది.

ప్లస్ పాయింట్స్ :

  • సెకండ్ హాఫ్
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

  • ఫస్ట్ హాఫ్
  • ల్యాగ్ సీన్స్

చివ‌రగా: బోరింగ్‌తో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది.

రేటింగ్: 2.25/5