మళ్ళి బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్న : నోయెల్ సేన్
Admin - November 4, 2020 / 05:47 PM IST

బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో, హౌస్ నుండి నోయెల్ సేన్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నోయెల్ ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇక ఆ సమస్య మరింత ఎక్కువ కావడంతో మెరుగైన చికిత్స కోసం బయటకు పంపారు. అయితే అలా బయటకు వచ్చిన నోయెల్ పలు ఆసక్తికరమైన విషయాలు పేర్కొన్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో నా ఫ్రెండ్స్ అయిన హారిక, అభి, లాస్య ను చాలా మిస్ అవుతున్నానని చెప్పకొచ్చాడు. అలాగే నేను హౌస్ నుండి బయటకు వచ్చేటప్పుడు నాకు తెలియకుండా నా బ్యాగ్ లో హారిక కొన్ని గుర్తులుగా పెట్టిందని ఆ విషయాన్నీ పంచుకున్నాడు. నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉందని, బిగ్ బాస్ వెళ్ళడానికి రెడీ గా ఉన్నానని పేర్కొన్నాడు నోయెల్.