Hyper Aadi: 25 నిమిషాల కోసం హైప‌ర్ ఆదికి బిగ్ బాస్ యాజ‌మాన్యం అంత ఇచ్చారా ?

Hyper Aadi: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోకి ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. దాదాపు 105 రోజుల పాటు తెగ సంద‌డి చేస్తున్న ఈ షో ఇటీవ‌లి కాలంలో స‌రైన రేటింగ్ ద‌క్కించుకోలేక‌పోతుంది. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ యాజ‌మాన్యం న‌వ‌రాత్రి స్పెష‌ల్‌గా ప్ర‌త్యేకంగా ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ప‌లువురు గెస్ట్‌లతో షో సంద‌డిగా సాగింది.

Hyper Aadi Remuneration for Bigg Boss Special Episode
Hyper Aadi Remuneration for Bigg Boss Special Episode

తన కామెడీ, టైమింగ్‌ పంచులతో బుల్లితెరపై తెగ న‌వ్వించే ఆది ప్రముఖ రీయాలిటీ షో తెలుగు బిగ్‌బాస్‌ 5కి అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. పోలీసు ఆఫీసర్‌గా బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి వచ్చిన ఆది అందరిని ఓ రెంజ్‌లో నవ్వించాడు. ఈ షోలో 25 నిమిషాల పాటు కనిపించిన ఆది పోలీసు ఆఫీసర్‌గా వచ్చి బిగ్‌బాస్‌ హౌజ్‌మెట్స్‌పై ఇన్వెస్టిగేషన్‌ చేశాను అంటూ వారి చరిత్ర అంతా విప్పాడు.

హౌజ్‌లో ఎవరెవరు ఏం చేశారు, ఎలా ఆడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో అన్ని బయటపెడుతూనే తనదైన శైలిలో హౌజ్‌మేట్స్‌పై పంచ్‌లు, సటైర్లు వేశాడు. అలా ఈ షోలో గెస్ట్‌గా తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆది ఉన్నంత సేపు బిగ్‌బాస్‌ ప్రేక్షకులంతా కూడా ఫుల్‌గా నవ్వేసుకున్నారు. ర‌వితో పాటుప‌లువురు కంటెస్టెంట్స్ కూడా ఇదే విష‌యాన్ని చెప్పారు.

కేవలం 25 నిమిషాలు కనిపించినందుకే దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఆది పారితోషికం తీసుకున్నాడని సమాచారం. కాగా గతేడాది కూడా దసరా సందర్భంగా బిగ్‌బాస్‌ 4 సీజన్‌కు సమంత హోస్ట్‌గా రాగా అదే ఎపిసోడ్‌కు ఆది గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే.

నవరాత్రి ఉత్సవాలు పేరుతో ఆదివారం బిగ్‌బాస్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ను నిర్వహింగా, ఈషోకు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హీరోహీరోయిన్‌ అఖిల్‌, పూజ హెగ్డేతో పాటు నటి మీనాక్షి, హెబ్బా పటెల్‌, నాట్యం నటి వచ్చి తమ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌తో అలరించారు. దీనితో పాటు కాస్తా కామెడీ టచ్‌ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ నిర్వహకులు ఆదిని తీసుకువచ్చారు.