Biggboss 5: హౌజ్‌మేట్స్‌తో చెడుగుడు ఆడిన ఆది.. పూజాని ఇంప్రెస్ చేసేందుకు నానా ప్ర‌య‌త్నాలు

Biggboss 5: ఆదివారం రోజు న‌వ‌రాత్రి స్పెష‌ల్ ఎపిసోడ్ ఏకధాటిగా నాలుగు గంట‌ల పాటు సాగింది. కింగ్ నాగార్జున ట్రెడిష‌నల్ డ్రెస్‌లో మెర‌వ‌గా, హౌజ్ మేట్స్ అంద‌ర‌కు కూడా అందంగా రెడీ అయ్యారు. సండేను స్పెషల్‌డేగా మార్చేందుకు స్టేజీ మీదకు విచ్చేసిన నాగ్‌.. మగాళ్లందరూ బంగార్రాజులాగా, ఆడాళ్లందరూ సత్యభామల్లా ఉన్నారంటూ కంటెస్టెంట్ల మీద పొగడ్తల వర్షం కురిపించాడు. నవరాత్రి సందర్భంగా 9 గేమ్స్‌, 9 అవార్డులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించాడు.

Family Video of Biggboss Housemates
Family Video of Biggboss Housemates

హౌజ్‌మేట్స్‌ని రెండు టీములుగా విభ‌జించిన నాగార్జున రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్‌, ప్రియాంక, లోబో, యానీ ల‌ను టీమ్ ఏగా మిగ‌తా వాళ్ల‌ని టీమ్ బీగా చెప్పుకొచ్చారు. అయితే ముందుగా రింగ్ ఫైట్ పెట్టారు. గెలిచిన వారికి ఫ్యామిలీ వీడియో చూపించారు. అంతేకాదు గెలిచిన టీమ్‌కి పాలాపిట్ట అవార్డ్ ఇచ్చారు.ఇలా 9 గేమ్స్ ఆడిస్తున్న క్ర‌మంలోనే మ‌ధ్య మ‌ధ్య‌లో ప‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొన‌సాగాయి.

Family Video of Biggboss Housemates
Family Video of Biggboss Housemates

నా తప్పు ఏమున్నదబ్బా అంటూ.. డ్యాన్స్‌తో హుషారెత్తించింది హెబ్బా పటేల్‌. ఇక తర్వాత కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌ డబ్బాలు పంపించాడు. ఎవరికి ఎక్కువ స్వీట్లు వస్తే వారే గెలిచినట్లు అని చెప్పాడు. ఈ టాస్క్‌లో కాజల్‌కు కాకరకాయ, ప్రియకు ఉల్లిపాయ రావడం గమనార్హం. ​కానీ రవి టీమ్‌లోని హమీదాకు పూతరేకులు, పింకీ, షణ్ముఖ్‌లకు స్వీట్లు రావడంతో A టీమ్‌ గెలవగా మరోసారి వారు పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయారు.

Family Video of Biggboss Housemates
Family Video of Biggboss Housemates

టీమ్ ఏ గెలిచిన సందర్భంగా యాంకర్‌ రవి భార్య, కూతురు మాట్లాడిన వీడియో ప్లే చేయడంతో అతడు ఎమోషనల్‌ అయ్యాడు. తర్వాత నాగార్జున రెండు టీములను చెరో 5 ప్రశ్నలు అడిగాడు. ఈ గేమ్‌లో ఎక్కువ సమాధానాలు చెప్పి ప్రియ టీమ్‌ గెలవడంతో ఆమె టీమ్‌లోని విశ్వకు అతడి ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. అందులో విశ్వ భార్య మాట్లాడుతూ.. ఏదున్నా మసులో పెట్టుకోకని సూచించింది. నాట్యం సినిమా కథానాయిక సంధ్యారాణి తన స్పెషల్‌ పర్ఫామెన్స్‌తో అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

అనంతరం కడవ మీద కడవ ఎత్తుకుని నడిచే టాస్కులో కాజల్‌ గెలిచింది. దీంతో ఆమె సభ్యురాలిగా ఉన్న B టీమ్‌కు పాలపిట్ట అవార్డు రాగా ప్రియకు ఆమె కుమారుడు మాట్లాడిన వీడియో చూపించారు. అనంతరం హౌజ్‌మేట్స్ అంద‌రు బత‌క‌మ్మ‌ని పేర్చి అందంగా ముస్తాబు చేశారు. బ‌త‌క‌మ్మ ఆట కూడా ఆడారు. మంగ్లీ మాస్‌ పాటలు పాడి తన గాత్రంతో అందరినీ ఓ ఊపు ఊపేసింది.

Hyper Aadi about all Housemates in Biggboss
Hyper Aadi about all Housemates in Biggboss

ఇక హైపర్‌ ఆది కంటెస్టెంట్లు అందరినీ చెడుగుడు ఆడేశాడు. హమీదా వాకిట్లో శ్రీరామ్‌ చెట్టు అనే ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారంటూ వాళ్లిద్దరి మీద జోకేశాడు ఆది. నాగ్‌ తాకిన షర్ట్‌ను అంత అపురూపంగా చూసుకున్నావు, మరి నన్ను స్విమ్మింగ్‌పూల్‌లో ఎక్కువ సేపు మునగాలన్న టాస్క్‌లో B టీమ్‌ నుంచి విశ్వ గెలిచింది. దీంతో అదే టీమ్‌లోని సిరికి ఆమె మాట్లాడిన వీడియో చూపించారు.

తర్వాత బొమ్మను అందంగా ముస్తాబు చేయాల్సిన టాస్క్‌లో ప్రియ టీమ్‌ గెలిచి మరోసారి పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయింది. ఆడిన 8 గేముల్లో ప్రియ 6 గెలవగా రవి 2 గెలిచాడు. తర్వాత స్టేజీ మీద సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ టీమ్‌. హీరో అఖిల్‌.. తనతో పాటు తీసుకొచ్చిన పూజా హెగ్డేను ఇంప్రెస్‌ చేయమని ఇంట్లోని మగవాళ్లకు టాస్క్‌ ఇచ్చాడు.

Housemates task to Impress Pooja Hegde
Housemates task to Impress Pooja Hegde

దీంతో శ్రీరామ్‌ పాట పాడగా, సన్నీ మిమిక్రీ చేశాడు. షణ్ముఖ్‌ మాత్రం సింగిల్స్‌ కోసం స్కిట్‌ వేశాడు. జెస్సీ, మానస్‌ డ్యాన్స్‌తో పడగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ పూజా మాత్రం.. తను అఖిల్‌కే పడిపోయానని చెప్పింది. అయితే ఈ గేమ్‌లో మానస్‌ గెలిచాడని తెలిపాడు నాగ్‌. ఇక ఈ వారం నామినేష‌న్‌లో మెల్ల‌మెల్ల‌గా అంద‌రిని సేవ్ చేసుకుంటూ వ‌చ్చిన నాగార్జున చివ‌ర‌కు హ‌మీదాని ఎలిమినేట్ చేస్తున్న‌ట్టు చెప్పుకొచ్చాడు.

స్టేజ్ మీదకు వెళ్లిన హమీదా త‌న జర్నీ వీడియో చూసి చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఒక్కొక్క‌రిలో మంచి చెడు గురించి మాట్లాడింది. అనంత‌రం బిగ్ బాస్‌ని వీడింది.

దీంతో మానస్‌కు ఫ్యామిలీ వీడియో చూపించారు. తర్వాత షణ్ముఖ్‌ సేవ్‌ అయినట్లు ప్రకటించారు. చివరగా విశ్వ, హమీదా మిగలగా… వీరిలో నుంచి హమీదా ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. హౌస్‌కు తానే హీరోయిన్‌ అని చెప్పుకొచ్చింది హమీదా.