Hyper Aadi: ప‌వన్ క‌ళ్యాణ్ పార్టీలో చేర‌తానంటూ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన హైప‌ర్ ఆది

Hyper Aadi: జ‌బ‌ర్ధ‌స్త్ కార్యక్ర‌మంతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన క‌మెడీయ‌న్స్‌లో హైప‌ర్ ఆది ఒక‌రు. ఆయ‌న కామెడీ పంచ్ ల‌కి ఎవ‌రైన ప‌డి ప‌డి న‌వ్వాల్సిందే. బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై కూడా అప్పుడప్పుడు అలా మెరుస్తున్న ఈ కమెడియన్.. తాజాగా పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు.

Hyper Aadi Says he will Join in Janasena
Hyper Aadi Says he will Join in Janasena

పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టపడే హైపర్ ఆది.. ఆయన పార్టీలో చేరే ఛాన్స్ ఉందా? అంటూ యాంకర్ వేసిన ప్రశ్నపై బదులిచ్చారు ఆది. పవన్ కళ్యాణ్‌కి తానెప్పుడూ సపోర్ట్ చేస్తానని, గతంలో ఎలక్షన్స్ సమయంలో జనసేన పార్టీకి క్యాంపెయిన్ కూడా చేశామని అన్నారు. ఒకవేళ ఫ్యూచర్‌లో పాలిటిక్స్ లోకి వెళ్లాలనే ఆలోచన వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీలోనే చేరతానని హైపర్ ఆది చెప్పడం విశేషం.

గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఏది చేస్తే అది కరెక్ట్ అని నమ్మకం పెట్టుకోవాలంతే అంటూ సింపుల్‌గా చెప్పారు హైపర్ ఆది. ఆయన కోసం ఎన్నేళ్ళైనా అండగా నిలబడతాం అని అన్నారు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా అంటూ అప్పట్లో జనసైనికుల్లో జోష్ నింపిన హైపర్ ఆది.. తాజాగా మరోసారి జనసేన పార్టీ గురించి ఇలా స్పందించడం ఆసక్తికరంగా మారింది.

Hyper Aadi Says he will Join in Janasena
Hyper Aadi Says he will Join in Janasena

హైప‌ర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మ‌నోడు ప్ర‌స్తుతం బుల్లితెర రారాజుగా మారాడు. ఆయ‌న వేసే పంచ్‌ల‌కు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. హైప‌ర్ ఆది ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నాన్ని ప్ర‌జెంట్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు.