Sarkaru vari pata : సర్కారు వారి పాటకి భారీ ఛేంజెస్..?

Sarkaru vari pata : సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా. ఫిబ్రవరిలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ఆ తర్వాత షెడ్యూల్ కూడా మార్చ్ 22 నుంచి ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే ప్లాన్ చేయగా ప్రస్తుతం షెడ్యూల్ కి బ్రేక్ పడినట్టు సమాచారం. వాస్తవంగా దుబాయ్ షెడ్యూల్ తర్వాత గోవాలో మళ్ళూ దుబాయ్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన చిత్ర బృందానికి కరోనా షాకిచ్చిందని తెలుస్తోంది.

huge-changes-for-sarkaru-vari-pata
huge-changes-for-sarkaru-vari-pata

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువవుతుండటంతో రిస్క్ చేయకూడాదనుకున్న చిత్ర బృందం కొన్నాళ్ళు విదేశాలలో సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం జరపడానికి వేరే ప్లాన్ వేస్తున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ లో సర్కారు వారి పాట కోసం బ్యాంక్ సెట్ తో పాటు మహేష్ బాబు మీద సోలో సాంగ్ కోసం ఒక ప్రత్యేకమైన సెట్ వేసి ఉంచారు. విదేశాలలో షూటింగ్ కి బ్రేక్ పడటంతో 25 నుంచి 30 రోజులు హైదరాబాద్ లో షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్.

Sarkaru vari pata : ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు.

అయితే ఎప్పటి నుంచి ఈ తాజా షెడ్యూల్ మొదలవబోతుందన్నది మాత్రం ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషనల్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. 2022 సంక్రాంతికి సర్కారు వారి పాట భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా వరసగా గత కొంతకాలంగా మహేష్ బాబు సూపర్ హిట్స్ ని అందుకుంటూ మంచి ఫాం లో ఉన్నాడు.

Advertisement