Hritik Roshan: ఆర్య‌న్‌కు స‌పోర్ట్ చేసిన హృతిక్.. కంగ‌నా ఏం కామెంట్ చేసిందో తెలుసా?

Hritik Roshan: ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.కొంద‌రు ప్ర‌ముఖులు ఆర్య‌న్‌కి మ‌ద్ద‌తుగా నిలుస్తుంటే మ‌రి కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. ఆర్యన్ ఖాన్ ని అధికారులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇదిలా ఉండగా ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటి నుంచి షారుఖ్ టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Hritik Roshan Extended His Support to Aryan Khan
Hritik Roshan Extended His Support to Aryan Khan

హృతిక్ రోషన్ ఆర్యన్ ఖాన్ కి మద్దతు తెలుపుతూ బహిరంగంగా లేఖ విడుదల చేశాడు. జీవితంలో ప్రతిదీ ఒక పాఠమే. మనం ఊహించనిది జరుగుతాయి జీవితంలో. అధైర్యపడకు. ఈ సమస్యని ధైర్యంగా ఎదుర్కొని బయటపడుతావు. నిజమైన హీరోగా నిలబడుతావు…,” ఇలా ధైర్య వచనాలు పలికారు హృతిక్.

హృతిక్ ఇలా పోస్ట్ చేసిన క్షణాల్లోనే కంగనా స్పందించింది. ఆర్యన్ ఖాన్ చేసిన తప్పులు, వాటివల్ల కలిగే ఇబ్బందులు అతడి దృక్పధాన్ని మారుస్తాయి. అంతమాత్రాన అతడు చేసిన తప్పులని సమర్ధించకూడదు. ఆర్యన్ ఖాన్ డిపెండ్ చేయడానికి మాఫియా పప్పు బ్యాచ్ రంగంలోకి దిగేసింది. మనం తప్పులు చేస్తాం.. కానీ ఎప్పుడూ వాటి గురించి గొప్పగా చెప్పుకోము అంటూ కంగనా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. హృతిక్.. ఆర్యన్ ఖాన్ కి మద్దతు తెలుపుతూ పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాలకే కంగనా ఈ పోస్ట్ పెట్టడం విశేషం.

హృతిక్, కంగన మధ్య గొడవలు ఈనాటివి కావు. హృతిక్ తనని ప్రేమించి మోసం చేశాడని ఆమె గతంలో ఆరోపించింది. హృతిక్ మీద కోపంతోనే ఆమె మొత్తం బాలీవుడ్ టాప్ హీరోలపై కక్ష పెట్టుకుందని అంటారు. అందుకే, ఆర్యన్ కి మద్దతుగా హృతిక్ పోస్ట్ చేయ‌గానే కంగాన అంత ఎత్తున లేచింది. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకం అని ఎన్సీపీకి చెందిన నేత నవాబ్ మాలిక్ ఆరోపిస్తున్నారు. తన ఆరోపణలకు బలంగా ఆయన కొన్ని వీడియోలు వదిలారు. ఆర్యన్ ఖాన్ ని ఎన్సీబీ ఆఫీస్ కి తీసుకురావడంలో ఒక బీజేపీ నేత ముఖ్య పాత్ర పోషించినట్లు కనిపిస్తోంది.