Priyanka chopra : ప్రియాంక చోప్రా చెల్లికి అవకాశాలు ఎలా వచ్చాయి..?

Priyanka chopra : ప్రియాంక చోప్రా.. గ్లోబల్ స్టార్ గా ఎంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ అన్నది అందరికి తెలిసిందే. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు హాలీవుడ్ లో కూడా నటించి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో ప్రియాంక చోప్రా ని హీరోయిన్ గా పనికి రావని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారని చాలా సందర్భాలలో ప్రియాంక వెల్లడించింది. అయినా తన మీద తనకున్న నమ్మకంతో ఈ రోజు గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. పాన్ ఇండియన్ సినిమాలు చేస్తోంది.

how priyanka-chopra-sister get into movies
how priyanka-chopra-sister get into movies

అయితే ప్రియాంక చోప్రా కజిన్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ ప్రియాంక రేంజ్ లో మాత్రం వారు సక్సస్ కాలేదు. మన్నారా చోప్రా, మీరా చోప్రా, పరిణీతి చోప్రా ప్రియాంక చోప్రా కి బంధువులే. అయితే పరిణీతి చోప్రా మాత్రం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా బాగానే సక్సస్ అయింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు అలాగే బయోపిక్స్ చేస్తూ క్రేజీ స్టార్ గా వెలుగుతోంది.

Priyanka chopra : ప్రియాంక చోప్రా అవకాశాలు ఇప్పించలేదని తెలిపింది..!

కానీ మీరా చోప్రా, మన్నారా చోప్రా మాత్రం హీరోయిన్స్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. వీరిలో మీరా చోప్రా తెలుగు సినిమాలలో కూడా నటించింది. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా, అలాగే నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకుడిగా మారి చేసిన వాన సినిమాలతో పాటు ఖిలాడి వంటి దాదాపు 30 సినిమాలు చేసింది. అయితే తను ప్రియాంక చోప్రాకి అవకాశాలు ఇప్పించలేదని.. సొంతగా ప్రయత్నాలు చేసి అక్క పేరు వాడుకోకుండా ఆడిషన్స్ చేసి దర్శక, నిర్మాతలు నచ్చే తనని సినిమాలలోకి తీసుకున్నట్టు తెలిపింది.

Advertisement