ACHARYA: వాయిదాలు ప‌డుతూ పోతున్న ఆచార్య‌.. ఇంకెన్ని రోజుల షూటింగ్ పెండింగ్ ఉందో తెలుసా?

ACHARYA కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లుంది ఇప్పుడు ఆచార్య సినిమా పరిస్థితి. ఒకటి రెండు కాదు.. మూడేళ్ళుగా ఈ చిత్రంతోనే బిజీగా ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. అయినా కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అవుతూనే ఉంది. ఈ పాటికే సినిమా కూడా విడుదల కావాల్సి ఉన్నా కూడా మధ్యలో ఎన్నో కారణాలు ఈ సినిమాకు అడ్డు తగులుతూనే ఉన్నాయి. అందులో మేజర్ బ్రేకులు కరోనా కారణంగానే వచ్చాయి. నిజానికి 2020లోనే ఆచార్య షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసాడు దర్శకుడు కొరటాల శివ. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో దాదాపు ఏడు నెలలు అక్కడే పోయింది.

Articles on internet on Acharya Release Date

మొన్నీమద్యే మళ్లీ పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అని షూటింగ్ ప్రారంభిస్తే మూడు నెలలు కూడా కాకుండానే మరోసారి కోవిడ్ దాడి మొదలైంది. ఇప్పటి వరకు 80 శాతం పైగానే షూటింగ్ పూర్తి చేసాడు కొరటాల. ఇంకా 15 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. చిరంజీవి వయసు దృష్ట్యా ఆయన బయటికి రావడం దాదాపు అసాధ్యం. 65 ఏళ్ళ మెగాస్టార్ ఇప్పుడు కానీ బయటికి వస్తే లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు విశ్లేషకులు. పైగా మేకర్స్ కూడా కంగారు పడటం లేదు.

వీలున్నపుడే షూటింగ్ పూర్తి చేసి మెల్లగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన 15 రోజుల షెడ్యూల్ జూన్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. రామ్ చరణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఆయనపై కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. చిరు, చరణ్ కాంబినేషన్ సీన్స్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు కొరటాల శివ. ప్రస్తుతానికి ఆయన అనుకున్న ప్లాన్ అయితే ఇదే. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Advertisement