Honey Rose : ఆ కమెడియన్ నా ప్రైవేట్ పార్టుల గురించి తప్పుగా మాట్లాడాడుః హనీరోజ్
NQ Staff - June 3, 2023 / 02:35 PM IST

Honey Rose : ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లు బొద్దుగా ఉంటే ఎంతో ఆదరించేవారు. అప్పట్లో ఎవరూ కూడా జీరో సైజ్ మెయింటేన్ చేయలేదు. అయినా సరే వారిని ప్రేక్షకులు బాగా ఆదరించారు. పైగా అప్పట్లో వారికి ఉన్నంత ఫాలోయింగ్ ఇప్పటి వరకు లేదు. కానీ ఇప్పుడు మాత్రం హీరోయిన్లు అంటే స్లిమ్ గా జీరో సైజ్ మెయింటేన్ చేయాల్సిందే.
ఏ మాత్రం లావు అయిపోయినా సరే బాడీ షేమింగ్ కు గురి కావాల్సిందే. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన ఈ రకమైన ట్రోలింగ్స్ బాగా పెరిగిపోయాయనే చెప్పుకోవాలి. కాగా బాలకృష్ణ వీరసింహారెడ్డిలో నటించిన హనీరోజ్ కూడా ఇలాంటి బాడీ షేమింగ్ కు గురి అయిందంట. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.
ఇండస్ట్రీలో నాపై చాలా కుళ్లు జోకులు వేసుకునేవారు. నా ముందు బాగానే మాట్లాడి.. పక్కకు వెళ్లిన తర్వాత చెండాలమైన కామెంట్లు చేసేవారు. ఓ షోలో నన్ను బాడీ షేమింగ్ చేస్తూ వెటకారంగా మాట్లాడారు. దానికి యాంకర్ కూడా పగలబడి నవ్వేసింది. ఆ యాంకర్ అమ్మాయి అయి ఉండి కూడా అలా నవ్వడం నాకు అస్సలు నచ్చలేదు.
ఓ స్టార్ కమెడియన్ కూడా నా ప్రైవేట్ పార్ట్స్ గురించి నా ముందే చెండాలంగా కామెంట్లు చేశాడు. చాలా బాధగా అనిపించింది. అయినా సరే నేను ఏమీ అనలేకపోయాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది హనీరోజ్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.