HIT: హిందీ హిట్ మొద‌లెట్టేశారు.. ఫ‌స్ట్ కేసులో ఏం తేల్చ‌నున్నారో మ‌రి..!

HIT: ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ సినిమాల‌పై హిందీ పరిశ్ర‌మ చాలా ఆస‌క్తి చూపిస్తుంది. మ‌న సినిమాల‌ని చాలా మంది రీమేక్ చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కి మంచి విజయం సాధించిన చిత్రం హిట్ హిందీలోకి రీమేక్ కాబోతుంది. తెలుగులో హిట్ చిత్రం విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందింది. కొత్త డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందింది.

HIT movie remake in hindi shoot beginned
HIT movie remake in hindi shoot beginned

హిట్ చిత్రం హిందీలో రీమేక్ కానున్న‌ట్టు , ఇందులో హీరో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో న‌టించ‌నున్న‌ట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. తెలుగులో తెరకెక్కించిన శైలేష్ కొలను హిందీలో కూడా రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. జెర్సీ మూవీని షాహిద్ కపూర్ తో హిందీలో రీమేక్ చేస్తున్న దిల్ రాజు మరో నిర్మాత కుల్దీప్ రాథోడ్ తో కలిసి హిట్ మూవీ నిర్మిస్తుండడం విశేషం. తాజాగా హిందీ హిట్ రీమేక్ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది.. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు.


హిట్ సినిమాని తెలుగులో హీరో నాని నిర్మించగా, హిందీలో దిల్ రాజు నిర్మిస్తుండ‌డం విశేషం. ఇందులో హీరోగా నటిస్తున్న రాజ్ కుమార్ రావు.. ఎలాంటి సినిమా అయినా సరే నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలో న్యూటన్, స్త్రీ, , ట్రాపడ్ , జడ్జ్ మెంటల్ హే క్యా.. వంటీ సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.రాజ్ కుమార్ రావు సరసన సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటించబోతోంది.


ఇంతకుముందు ‘పాగ్‌లైట్‌’ అనే నెట్‌ఫ్లిక్స్ సీరీస్ లో కన్పించిన ఈ భామ “హిట్” సినిమా చూశానని, ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించడం సంతోషంగా ఉందని వెల్లడించింది. మరోవైపు తెలుగు హిట్ స్వీక్వెల్‌కీ ప్రయత్నాలు మొదలయ్యాయి. పార్ట్-1 క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చిన డైరెక్టర్.. దానికి తగ్గట్టుగా స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నారట. సీక్వెల్‌లో అడివి శేష్ న‌టించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు కూడా.