Trisha: గుడిలో చెప్పులు వేసుకొని క‌నిపించిన త్రిష‌.. అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

Trisha: ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన‌ తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల “పోన్నియన్ సెల్వన్” కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం “పోన్నియన్ సెల్వన్” అనే నవల పేరు మీదుగా సినిమా తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని లైకా సంస్థ నిర్మించ‌నున్న విష‌యం తెలిసిందే.

Hindu Organizations Lodged Complaint Against Trisha
Hindu Organizations Lodged Complaint Against Trisha

పోన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంలో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తి వంటి స్టార్ హీరో హీరోయిన్స్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ప‌లు వివాదాల‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతుంది.


ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ సెల్ లో ఓ గుర్రం మ‌ర‌ణించ‌డంతో మ‌ణిర‌త్నంపై కేసు న‌మోదయ్యింది. పెటా ఇండియా మ‌ణిర‌త్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యాన‌ర్ మ‌రియు గుర్రం య‌జ‌మానిపై కూడా కేసు న‌మోదు చేసింది. వారి ఫిర్యాదు మేర‌కు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో షూటింగ్ ల కోసం నిజ‌మైన జంతువుల‌ను కాకుండా గ్రాఫిక్స్ ను వాడాల‌ని పెటా డిమాండ్ చేసింది.


తాజాగా త్రిష వివాదంలో ఇరుక్కుంది. శుక్రవారం త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే హిందువులు పవిత్రంగా భావించే దేవుళ్ల విగ్రళ్లు ఉన్న ప్రాంతానికి త్రిష పాదరక్షలు ధరించి రావడాన్ని హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. త్రిష‌తో పాటు ద‌ర్శ‌కుడు మ‌ణిరత్నంపై కేసు న‌మోదు చేయాల‌ని హిందు సంఘాలు మండిప‌డుతున్నాయి.