Hinakhan: మాస్క్ వ‌ల్ల ఈ న‌టి ముఖం ఎలా మారిందో చూడండి..!

Hinakhan: క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ప్ర‌తి ఒక్క‌రికి మాస్క్ త‌ప్ప‌ని స‌రి అయింది. ఎక్క‌డికి వెళ్లిన మాస్క్త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. కొంద‌రికి మాస్క్ వ‌ల‌న ఎల‌ర్జీ వ‌స్తున్నా కూడా త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల్సి వ‌స్తుంది. అయితే ఇన్నాళ్లు ప్ర‌శాంతంగా ఉన్న కరోనా ఇప్పుడు తిరిగి పుంజుకుంది. దీంతో మ‌ళ్లీ మాస్క్‌లు, శానిటైజ‌ర్స్ త‌ప్పనిస‌రి అయ్యాయి.

realhinkhan latest pics
realhinkhan latest pics

ఈ వేవ్‌లో ఎక్కువ మంది సెల‌బ్స్ క‌రోనా బారిన పుతున్నారు. ఈక్రమంలో హిందీ టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీనా ఖాన్ కుటుంబం కరోనా బారిన పడింది. అదృష్టవశాత్తూ ఆమెకు తప్ప అందరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈనేపథ్యంలో వైరస్‌ నుంచి రక్షించుకునేందుకు నిత్యం మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతున్నానంటోంది.

realhinkhan latest pics
realhinkhan latest pics

అందుకు తన ముఖం మీద ఎర్రటి మచ్చలే నిదర్శనమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది‘ఈ రోజుల్లో జీవితమన్నా సోషల్‌ మీడియా అన్నా .. ఏదైనా మంచి ఫొటోలు సమకూర్చుకోవడమే. దానికి అందరమైన విజువల్స్‌ జోడించడమే. కానీ 2022కి వచ్చేసరికి పరిస్థితులు 2020 కంటే కూడా సంక్లిష్టంగా మారిపోయాయి.

realhinkhan latest pics
realhinkhan latest pics

ఇంట్లో అందరూ కొవిడ్ 19 పాజిటివ్ గా తేలి.. మీరొక్కరే నెగెటివ్‌గా ఉన్నప్పుడు… మాస్కులు, శానిటైజర్లతో సన్నద్ధం కావడం తప్ప మరో మార్గమేదీ ఉండదు . ఈ క్రమంలో 24 గంటల సేపు మాస్కులు ధరించడం వల్ల ముఖం మీద ఇలాంటి మరకలు తప్పవు మరి. ఇలా మరకలు, యుద్ధ చిహ్నాలతో… మరోసారి కొవిడ్‌పై పోరాటం చేద్దాం రండి’ అని రాసుకొచ్చింది హీనా ఖాన్‌.

realhinkhan latest pics
realhinkhan latest pics

ఇందులో ఆమె చర్మం ఎర్రగా కమిలిపోయి ముఖంపై ఎర్రటి మచ్చలు ఉండడం స్పష్టంగా చూడవచ్చు. కాగా బాలీవుడ్‌లో కరీనాతో పాటు అర్జున్‌ కపూర్‌, ఏక్తాకపూర్‌, స్వరాభాస్కర్‌, జాన్‌ అబ్రహాం దంపతులు, మృణాళ్‌ ఠాకూర్‌ తదితర ప్రముఖులు కరోనాకు గురయ్యారు.