Himaja: పెరిగిన హిమ‌జ రేంజ్.. మ‌రో కొత్త కారు కొనుగోలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ

Himaja: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం చాలా మందికి మంచి లైఫ్ ఇచ్చింది. నార్మ‌ల్ స్టేజ్‌లో ఉన్న వారిని తీసుకెళ్లి అంద‌లాన కూర్చోపెట్టింది. బిగ్ బాస్ త‌ర్వాత చాలా మంది జీవితాలు పూర్తిగా మారాయి. కొత్త కార్లు, బంగ్లాలు అస‌లు వారి లైఫ్ స్టైల్ చూస్తుంటే అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు సాదాసీదాగా ఉన్న వారి జీవితం ఇప్పుడు ఎంత రిచ్‌గా మారింద‌ని ముచ్చ‌టించుకున్నారు.

Himaja Buys new Car
Himaja Buys new Car

గుంటూరు జిల్లా వీర్లపాలెంకు చెందిన హిమ‌జ మొద‌ట సీరియ‌ల్స్‌తో పాటు సినిమా పరిశ్రమలో ప‌ని చేసింది. వినయ విధేయ రామా, చుట్టాలబ్బాయితో పాటు ప‌లు చిత్రాల‌లో కీల‌క పాత్ర‌లు చేసింది. అలా పాపుల‌ర్ అయిన హిమ‌జ బిగ్ బాస్ ఇంట్లోకి 5వ కంటెస్టెంటుగా ఎంటరయ్యి దుమ్ము దులిపేసింది.

ఒక ర‌కంగా హిమ‌జ కెరియ‌ర్‌ని బిగ్ బాస్ షో పూర్తిగా మార్చేసింద‌నే చెప్పాలి. ఈ షో త‌ర్వాత హిమ‌జకు సినిమా ఆఫ‌ర్స్ ఎక్కువ‌య్యాయి. కొన్ని సినిమాల‌లో హిమ‌జనే క‌థానాయిక‌గా తీసుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు సినిమాలకు ఇచ్చిన దాని కంటే ఎక్కువ పేమెంటే బిగ్ బాస్ వాళ్లు ఇచ్చారని చెప్పిన హిమ‌జ‌, ఆ రెమ్యునరేషన్‌తోనే కొత్త ఇల్లు కొన్నానని స్పష్టం చేశారు .

నటిగా 10కి పైగా సినిమాలు చేసిన హిమజ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే, బిగ్ బాస్ సీజన్ 1కే హిమజను కలిశారట నిర్వాహకులు. కానీ, అప్పడు తన చేతిలో సినిమాలు ఉండటంతో హిమజ నిరాకరించారట.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హింజ అప్పుడ‌ప్పుడు త‌న అంద‌మైన ఫొటోలే కాదు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా షేర్ చేస్తుంటుంది. ఇప్ప‌టికే కాస్ట్‌లీ కారు ఓన‌ర్‌గా ఉన్న హిమ‌జ తాజాగా మహీంద్రా థార్ వాహనాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా, ఆమెకు స‌న్నిహితుల నుండే కాక ప‌లువురు సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

కారు ధ‌ర దాదాపుగా 13 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలు ఖరీదు ఉంటుంది. రెండు చేతులా సంపాదిస్తున్న హిమ‌జ రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తుండ‌డం చూసి అంతా అవాక్క‌వుతున్నారు.