Highway Movie Review : ఆనంద్ దేవరకొండ హైవే మూవీ రివ్యూ
NQ Staff - August 19, 2022 / 10:10 AM IST
Highway Movie Review : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తను తన రెండవ చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేసి విజయం సాధించాడు. ఇక థియేటర్లలో విఫలమైన పుష్పక విమానం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విజయవంతమైంది. బహుశా ఈ క్రమంలోనే ‘హైవే’ కోసం నేరుగా డిజిటల్ విడుదలను ఎంపిక చేసుకున్నాడు. ఈ చిత్ర కథ విషయానికి వెళితే.
కథ:
విష్ణు (ఆనంద్ దేవరకొండ) ఓ ఫొటోగ్రాఫర్. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం స్నేహితుడైన సముద్రంతో (సత్య) కలిసి వైజాగ్ నుండి బెంగళూరు బయలుదేరుతాడు. మంగళూరులో ఉన్న తన తండ్రిని కలుసుకోవడానికి తులసి (మానస రాధాకృష్ణన్) ఒంటరిగా బయలుదేరుతుంది. మధ్యలో బస్ మిస్ కావడంతో ఆమెకు విష్ణు లిఫ్ట్ ఇస్తాడు. కొద్ది పరిచయంలోనే తులసితో విష్ణు ప్రేమలో పడతాడు. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఓ సైకో కిల్లర్ (అభిషేక్ బెనర్జీ) వరుసగా యువతులను హత్య చేస్తుంటాడు. అతడిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ ఆశా భరత్(సయామీ ఖేర్) ప్రయత్నిస్తుంటుంది. సైకో కిల్లర్ బారి నుండి తులసి రక్షించడానికి విష్ణు ఎలాంటి సాహసం చేశాడు? పోలీస్ ఆఫీసర్‌తో కలిసి విష్ణు అతడిని పట్టుకున్నాడా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
నటీనటుల పర్‌ఫార్మెన్స్:
ఉన్నంతలో ఆనంద్ దేవరకొండ ఒక్కడే కొంతవరకు యాక్టింగ్ తో మెప్పించాడు. విష్ణుగా అతడి పాత్ర బాగుంది. హీరోయిన్ మానస రాధాకృష్ణన్ తో పాటు సయామీఖేర్ యాక్టింగ్ బేసిక్స్ లెవల్ లోనే ఆగిపోయింది. సైకో కిల్లర్ పాత్రకు అభిషేక్ బెనర్జీ సరిగ్గా కుదరలేదు. థ్రిల్లర్ సినిమాలో కామెడీ అవసరం లేదని అనుకున్నాడో ఏమో దర్శకుడు కమెడియన్ గా కేవలం సత్యను మాత్రమే తీసుకున్నాడు. అతడు కూడా నవ్వించకూడదని ఫిక్స్ అయినట్లున్నాడు. ఒక్క సీన్ లో కూడా అతడి కామెడీ వర్కవుట్ కాలేదు.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్ :
సైమన్ కె కింగ్ స్వరపరిచిన నేపథ్య సంగీతం చిత్రానికి అవసరమైన మూడ్‌ని జోడించింది. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది, అయితే సినిమాలో కొన్ని మంచి లొకేషన్స్‌ని అందంగా చిత్రీకరించవచ్చు, కానీ దాన్ని సరిగా చూపించలేకపోయారు అనిపిస్తుంది. కెవి గుహన్ మరోసారి థ్రిల్లర్ కథతో ముందుకు వచ్చారు మరియు అతని మునుపటి చిత్రం ‘WWW’ మాదిరిగానే తన మేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. సినిమాల్లో రెండే పాటలు ఉన్నాయి. అవి కూడా సినిమా నిడివిని పెంచడానికే ఉపయోగపడ్డాయి.
ప్లస్ పాయింట్స్:
ఆనంద్ దేవరకొండ నటన
మైనస్ పాయింట్స్
నిదానంగా సాగే కథ
సినిమాటోగ్రఫీ
పాటలు
విశ్లేషణ:
పేరుకు ఇది 2022 లో తీసిన సినిమానే అయినా రాత, తీతలో మాత్రం 2000దశకంలోనే ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. సైకో కిల్లర్ జానర్ లో 2010 టైమ్ లో వచ్చిన కొరియన్ సినిమా ఐ సా ది డెవిల్ ను మరోసారి చూసిన భయం కలుగుతుంది. కానీ హైవే మాత్రం ఒక్కసారి కంప్లీట్ చేయడానికే నీరసం ముంచుకొచ్చేస్తుంది. హైవే ప్రయాణం మొత్తం గజిబిజిగా సాగిపోతూ గందరగోళానికి గురిచేస్తుంది. సినిమా ప్రేక్షకులకి బోరింగ్ తో పాటు చిరాకు తెప్పిస్తుంది.
రేటింగ్: 2/5