Social Media: మీడియాలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ ఉన్న అందాల భామ‌లెవ‌రు?

Social Media డిజిట‌ల్ యుగంలో సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త చాలా పెరిగింది. ఏ వార్త అయిన కొద్ది నిమిషాలలోనే ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తుంది సోష‌ల్ మీడియా. ఇక సెల‌బ్రిటీల‌కు ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించ‌డానికి, త‌మ సినిమాల ప్రమోష‌న్స్, బ్రాండ్స్‌ని ప్ర‌మోట్ చేయ‌డం లేదంటే ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు షేర్ చేయ‌డానికి సోష‌ల్ మీడియాని ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో అందాల భామ‌లు చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవ‌ర్స్ సంఖ్య పెంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వ‌ర‌కు చూస్తూ టాప్ 10 ఫాలోవ‌ర్స్‌లో ప్రియాంక చోప్రా నిలుస్తుంది. ఈమెకి ఇన్‌స్టాగ్రాములో 64.5 మిలియన్స్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక రెండో స్థానంలో సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్ నిలిచింది. ఇప్పటికి శ్రద్ధా 62.8 మిలియన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మ‌డు సాహో చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఇటీవ‌లే ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసందే.

మూడో స్థానంలో సింగర్ నేహాకక్కర్ ఉన్నారు. ఈమెకు 58.9 మిలియ‌న్స్ ఫాలోవర్స్ ఉండ‌గా, ఈమె హుషారైన పాట‌ల‌తో కిరాక్ పుట్టిస్తుంది. ఇక 57.1 మిలియన్స్ ఇన్ స్టా ఫాలోయర్స్ ద‌క్కించుకొని నాలుగో స్థానంలో ఉంది . ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈమె త్వ‌ర‌లో ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయ‌నుంది

ఐదో స్థానంలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియాభట్ నిలిచింది. ఈ కుర్రభామకు ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 53.5 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ఆరోస్థానంలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిలిచింది. ఇన్‌స్టాలో ఈ అమ్మ‌డికి 52.2 మిలియన్స్ ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాతో డెబ్యూ చేయబోతుంది.

ఏడో స్థానంలో అనుష్కశర్మ నిలిచింది. ఆమెకు ఇన్‌స్టాలో 50.5 మిలియన్స్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇటీవలే బేబీ వామికకు జన్మనిచ్చిన ఈ అమ్మ‌డు పాప‌కు సంబంధించిన ఒక్క ఫొటో కూడా షేర్ చేయ‌లేదు. ఇక ఎనిమిదో స్థానంలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామకు ఇంస్టాగ్రామ్ లో 50.5 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ప్రస్తుతం టైగర్ సిరీస్ 3 మూవీ చేస్తోంది.

తొమ్మిదో స్థానంలో వరల్డ్ వైడ్ పాపులర్ శృంగారతార సన్నీలియోన్ నిలిచింది. సన్నీకి ఇంస్టాగ్రామ్ లో 46.1 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప‌ర్స‌న‌ల్ , ప్రొఫెష‌న‌ల్ పోస్ట్‌లు పెడుతుంది. ఇక పదో స్థానంలో దిశాపటాని నిలిచింది. ఈ బ్యూటీకి ప్రస్తుతం 44.4 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. లోఫ‌ర్ సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్ష‌కుల‌ని కూడా ప‌ల‌క‌రించింది.