వయసేమో 50..పెళ్ళికి మాత్రం ఇంకా నో చెప్తున్నా టాలీవుడ్ హీరోయిన్స్

ఎవరి జీవితంలో అయినా పెళ్లి చాలా ముఖ్యం. మనకంటూ ఒక తోడు ఉంటె జీవితం హాయిగా సాగిపోతుంది అంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఒకప్పుడిలా పెళ్లిళ్లు సరిగ్గా జారడగం లేదు. మన బామ్మల సమయంలో 15 యేళ్ళ లోపే పెళ్లి చేసేవారు. మన అమ్మలా సమయానికి వచ్చేసరికి 20 యేళ్లు వస్తే పెళ్లి చేసారు.ఇప్పుడు 30 వస్తే కానీ పెళ్ళికి ఒకే అనడం లేదు. ఇక సెలెబ్రేటిస్ గురించి ఎంత చెప్పిన తక్కువే 50 యేళ్లు వచ్చిన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో తెలియని పరిస్థితి. మరి హాఫ్ సెంచురీ కి దగ్గర ఉండి పెళ్ళికి మాత్రం దూరంగా ఉంటున్న వారు ఎవరో ఒకసారి చూద్దాం.

heroines with no marriages

1) సితార : ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తుంది. వయసేమో 47 యేళ్లు. కానీ పెళ్లి మాట ఎత్తడం లేదు. కారణం ఏంటో తెలియదు కానీ మంచి అబ్బాయి దొరికితే చెప్పండి అంటూ దాటవేస్తుంది పెళ్లి మాట ఎత్తితే.

2) శోభన : ఈమెతో కలిసి హీరో గా చేసిన చిరంజీవి బాలకృష్ణ లు తాతయ్యలు అయ్యారు . కానీ 50 ఏళ్ల శోభన్ మాత్రం పెళ్లికూతురు కాలేదు.

3) నగ్మా : దేవుడి సేవ బాగానే చేస్తున్న ఫ్యామిలీ లైఫ్ గురించి మాత్రం వద్దు అంటుంది. 45 ఏళ్ళు వచ్చిన సోలో లైఫ్ సో బెటర్ అంటూ ముందుకు వెళ్ళిపోతుంది.

4) టబు : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికి అలాగే వుంది. కానీ వయసు ఆగడు కాదండి 48 యేళ్లు నిండిపోయాయి. కానీ కల్యాణ గడియలు మాత్రం రాలేదు.

5) సుష్మితా సేన్ : నలుగురు పిల్లలను దత్తత ఈ 44 ఏళ్ళ భామ తనకన్నా 15 యేళ్లు చిన్న వయసు ఉన్న అబ్బాయితో అఫైర్ నడిపిస్తుంది. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో మాత్రం చెప్పడం లేదు.

6) అమీషా పటేల్ : సినిమాలు మానేసి రిటైర్ అయ్యి పదేళ్లు దాటింది. ఈమె వయసు ఇప్పుడు 44 యేళ్లు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి హీరోల పక్కన అదరగొట్టింది. కానీ పెళ్లి అంటే మాత్రం బెదిరిపోతుంది.

7) కౌసల్య : అల్లుడు గారు వచ్చారు, పంచదార చిలక సినిమాల్లో నటించిన కౌసల్య అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తుంది. ఈమె వయసు 40 కానీ పెళ్లి మాత్రం కాలేదు.

ఇక వెన్నిరాడై నిర్మల, ముత్యాల ముగ్గు సంగీత వంటి వారు డెబ్భైకి దగ్గర్లో ఉన్న పలు కారణాల చేత పెళ్లి కి మాత్రం దూరంగా ఉన్నారు.

Advertisement