Heroines : తల్లిదండ్రుల బలవంతం పైన హీరోయిన్స్ గా మారిన నటీమణులు

tollywood heorines

Heroines (హీరోయిన్స్): నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చే వారు ఉన్నారు. సినిమా చాన్సుల కోసం కాళ్లరిగేలా తిరిగి తమని తాము నిరూపించుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. సినిమాల్లో నటిస్తే ఫేమ్ తో పాటు డబ్బుకి డబ్బు సంపాదించవచ్చు. అయితే కేవలం డబ్బు కోసమే సినిమాల్లోకి పిల్లలను నెట్టేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారిని కేవలం డబ్బులు సంపాదించే మిషీన్స్ లానే చూశారు.

ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ .. నన్ను నేను నిరూపించుకుంటాను అంటూ అమాయకంగా డైలాగ్ చెప్పిన హీరోయిన్ సంగీత. ఖడ్గం సినిమాలో ఆమె చెప్పిన ఈ డైలాగ్ చాలా ఫేమసయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సంగీత నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే కేవలం డబ్బుల కోసమే సంగీతను తన తల్లి సినిమాల్లో నటింపజేసిందని సంగీత ఆరోపించింది. 13ఏళ్ల వయసులోనే చదువు మాన్పించి బలవంతంగా సినిమాల్లోకి నెట్టిందని సంగీత చెప్పుకొచ్చారు. తర్వాత సింగర్ క్రిష్ ని పెళ్లి చేసుకున్న సంగీత ప్రశాంతంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

కుటుంబం వల్ల నష్టపోయిన మరో నటి వనితా విజయ్ కుమార్. తల్లి డ్రగ్స్  కి బానిసని.. తండ్రికి డబ్బు పిచ్చని చెప్పింది. ఇంట్లో తప్పులు జరిగేవని.. చిన్న వయసులోనే హీరోయిన్ గా ఉండలేక ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నానని వనిత విజయ్ కుమార్ షాకింగ్ న్యూస్ చెప్పారు.

అలనాటి అందాల తర కాంచన సైతం తల్లిదండ్రుల కారణంగా సినిమాల్లోకి వచ్చారు. తన కూతురి సంపాదించిన ఆస్తినంతా కాజేసి ఆమెను చంపాలనుకున్నారట. ఇదంతా తెలిసిన కాంచన ఇంటి నుంచి బయటకు వచ్చేసి.. కోర్టుల చుట్టూ తిరిగి ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.

జర్నీ ఫేమ్ అంజలి కూడా తన పిన్ని వల్లే సినిమాల్లోకి వచ్చింది. చదువుకుంటున్న టైమ్ లోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె సంపాదించిన డబ్బులన్నీ తన పిన్నే వాడుకున్నారు. పెద్దయిన తర్వాత అంజలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పిన్ని నుంచి దూరంగా ఉంటున్నారు.

Advertisement