Srileela : హీరోయిన్‌ తల్లి పై కేసు నమోదు.. అరెస్ట్‌ తప్పేలా లేదు ..!

NQ Staff - October 8, 2022 / 10:48 AM IST

Srileela : హీరోయిన్‌ తల్లి పై కేసు నమోదు.. అరెస్ట్‌ తప్పేలా లేదు  ..!

Srileela : పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీ లీల. ఈమె తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇన్ని రోజులు పాటు ఈమె ఫోటో షూట్స్ గురించి సినిమాల గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆమె తల్లి ఒక కేసులో అరెస్ట్ అవ్వబోతుంది అనే విషయమై వార్తల్లో నిలిచింది.

పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీలీల యొక్క తల్లి స్వర్ణలత తన భర్తతో 20 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు.ఇద్దరు విడిపోయి చాలా సంవత్సరాలు అయింది, కానీ అధికారికంగా మాత్రం విడాకులు తీసుకోలేదు. ప్రస్తుతం వీరి యొక్క విడాకుల కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3వ తారీఖున కోరమంగల లో ఉన్న తన అపార్ట్మెంట్ లోకి స్వర్ణలత తాళం పగలగొట్టి మరి వెళ్ళిందని అక్కడ విలువైన డాక్యుమెంట్స్ ని మరియు వస్తువులను కొల్లగొట్టింది అంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.స్వర్ణలతపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే స్వర్ణలత ఒక కేసులో ఏ2 నిందితురాలుగా ఉండి బెయిల్ పై బయట ఉంది. బెయిల్ పై ఉన్న వ్యక్తిపై మళ్లీ కేసు నమోదు అవ్వడంతో వెంటనే అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు.

ఆమె విడాకుల వివాదం హీరోయిన్ శ్రీ లీల కెరియర్ పై పడుతుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రీ లీల కెరీర్‌ పరంగా బిజీ బిజీగా ఉన్నా తల్లి ఇష్యూతో కాస్త చిరాకులు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us