Sneha : పోలీసుల‌ని ఆశ్రయించిన న‌టి స్నేహా..బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు..!

Sneha : ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చిన గ్లామ‌ర్ బ్యూటీ స్నేహా గ్లామర్ షోలకు తావివ్వకుండా.. చీరకట్టుతో.. అందం అభినయంతో ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న స్నేహా .. ఆ తర్వాత టాలీవుడ్‏లో వరుస అవకాశాలను అందుకుంటూ కొన్నేళ్లపాటు టాప్ హీరోయిన్‍గా కొనసాగారు.

Heroine Sneha filed police case
Heroine Sneha filed police case

కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు స్నేహా. అలా తమిళంలో అచ్చాముందు అచ్చాముందు సినిమా షూటింగ్ సమయంలో కోలీవుడ్ హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి.. 2012లో వివాహం చేసుకున్నారు స్నేహా. పెళ్లి తర్వాత కూడా స్నేహా సినిమాల్లో నటిస్తూ వచ్చింది.

Heroine Sneha filed police case
Heroine Sneha filed police case

తాజా సమాచారం ప్రకారం.. చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్‌ ​కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ బిజినెస్‌ కోసం డబ్బు అప్పుగా తీసుకున్నారని, వారికి వడ్డీ కింద 26 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. అయితే ఇప్పుడు వారు తనని మోసం​ చేశారని, వడ్డీ చెల్లించమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఆరోపించారు.

అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహా తన ఫిర్యాదు పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. తన ఫిర్యాదు మేరకు దీనిపై దర్యాప్తు చేపట్టాలని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్నేహా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. కాగా స్నేహా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన స్నేహా ఆ తర్వాత తన చిరకాల స్నేహితులు, నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటకు ఒక కుమారుడు, కూమార్తె ఉన్నారు.

పెళ్లి తర్వాత స్నేహా పలు వాణిజ్య ప్రకటనలతో పాటు సినిమాల్లో సహాయ నటిగా, హీరోలకు వదిన, అక్క వంటి పాత్రలు చేస్తూ వస్తున్నారు.