Roja: తీవ్రమైన అప్పుల్లో ఉన్న హీరోయిన్ రోజాను ఆదుకుంది ఎవరు ..?

heroine roja

Roja(రోజా) …హీరోయిన్ గా, బుల్లి తెర వ్యాఖ్యాతగా, రాజకీయ నాయకురాలిగా అనేక రంగాల్లో రాణిస్తున్న నటి రోజా. 1972 లో తిరుపతి లో జన్మించిన రోజా, అక్కడే డిగ్రీ వరకు చదివింది. చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాల్లో అవకాశం రావడంతో రాజేంద్ర ప్రసాద్ పక్కన హీరోయిన్ గా నటించింది. అక్కడ నుండి మొదలయిన రోజా ప్రయాణం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా పని చేసే వరకు కొనసాగింది. సినిమాల్లో నటిస్తున్న క్రమం లోనే దర్శకుడు సెల్వమణి తో ప్రేమలో పడి చాలా ఏళ్ళ పాటు ఎదురుచూసి పెద్దల అంగీకారం తో పెళ్లి చేసుకుంది. సెల్వమణి తమిళుడు కావడం తో ఆమె తమిళ్ లో సైతం ఎక్కువగా సినిమాల్లో నటించింది.

heroine roja personal life struggles రోజా
heroine roja personal life struggles

ఇక అస్సలు విషయానికి వస్తే పెళ్లి చేసుకున్నాక సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రొడక్షన్ కంపెనీ ని ఏర్పాటు చేసి సినిమాల నిర్మాణం చేపట్టింది. భర్త సెల్వమణి ని దర్శకుడిగా పెట్టి సినిమాలను నిర్మించిన రోజాకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలాయి. తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికంగా చితికిపోవాల్సి వచ్చింది. పైగా రోజాను నమ్ముకొని ఆమె అన్న వదిన పిల్లలు కూడా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. ఇలా అందరు రోజా సంపాదనపై బ్రతకాల్సిన పరిస్థితి. ఆ సమయంలో రోజా టీడీపీ పార్టీలో ఉండి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయింది. ఇలా రాజకీయంగా మరియు సినిమాల పరంగా నష్టపోవడంతో సినిమాల్లో దశాబ్దం పాటు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇక లాభం లేదు అనుకోని జబర్దస్త్ రియాలిటీ షో లో వ్యాఖ్యాతగా చేయడం ప్రారంభించింది. ఇలా తన అప్పుల నుండి ఉపశమనం పొందడానికి మల్లి సినిమాల్లో నటించడానికి కూడా వెనకాడలేదు. ఆలా కొంత సెటిల్ అయినా తర్వాత వైసీపీ లో చేరి ఎమ్మెల్యే గా గెలిచి మల్లి తన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంది రోజా.

Advertisement