కోటీశ్వరులను కాదని ఒక అనామకుడిని రాశి ఎందుకు పెళ్లి చేసుకుంది

రాశి..దశాబ్దం క్రితం వరకు తన బొద్దు అందాలతో కుర్రకారు గుండెలను మెలితిప్పిన హీరోయిన్. బాల నటిగా పలు భాషల్లో నటించి అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా మారింది. హీరో పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత వంటి సినిమాలు చేసిన రాశి, ప్రేయసి రావే, స్నేహితులు, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు వంటి పలు విజయవంతమైన తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో హీరోయిన్ గా 80 కి పైగా సినిమాల్లో నటించింది. సినిమా కెరీర్ మంచి టర్న్ తీసుకుంటున్న సమయంలో సెట్స్ లో పరిచయమైనా అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకొని నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది.

raasi

అసిస్టెంట్ దర్శకుడితో రాశి ప్రేమ కథ

సినిమా షూటింగ్ లొకేషన్ లో పరిచయం అయినా శ్రీముని అనే అసిస్టెంట్ దర్శకుడితో ప్రేమలో పడింది రాశి. చాలా రోజుల వరకు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. ఇక శ్రీముని సైతం రాశి నటించిన పలు సినిమాలు పని చేసాడు. రాశి తండ్రి చనిపోయిన సమయంలో ఆమె పక్కనే ఉండి డిప్రెషన్ లో ఉన్న రాశికి అండగా ఉన్నాడట శ్రీముని. అందుకే ఎంతో మంది కోటీశ్వరులు ఆమెను పెళ్లి చేసుకోవాలని చుసిన రాశి మాత్రం ఒక అనామక అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకొని సినిమాల నుండి తప్పుకుంది.

రాశి సెకండ్ ఇన్నింగ్స్

కొన్నాళ్ల తర్వాత ఒక పాపకు జన్మ ఇచ్చిన రాశి సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలని చూసింది. కానీ ఆమెకు అంత మంచి ఆఫర్స్ రాకపోవడం తో ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తుంది. ఇక బుల్లి తెర పై కూడా ఒక షో లో కనిపించినప్పటికి అది సక్సెస్ అవ్వలేదు. ఏది ఏమైనా హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అయినా రాశి సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం నత్త నడకన నడుస్తుంది.

Advertisement