Pranitha: ప్ర‌ణీత‌ను హ‌ర్ట్ చేసిన గూగుల్‌.. ఫైర్ అయిన క‌న్న‌డ ముద్దుగుమ్మ‌

Pranitha: చూడ‌టానికి ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే ప్ర‌ణీత సుభాష్ మంచి న‌టే కాదు మాన‌వ‌త్వం ఉన్న మంచి మ‌నిషి. గత ఏడాది క‌రోనా స‌మ‌యం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూనే ఉంది. అయితే ”ఏం పిల్లో.. ఏం పిల్లడో” సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ప్ర‌ణీత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం ఉన్నప్పటికీ ఈ భామకు అదృష్టంలేదు.. అందుకే సహాయనటిగా మిగిలిపోయింది. కన్న‌డ‌లో మాత్రం స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. అయితే ఈ అమ్మ‌డు రీసెంట్‌గా సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని అంద‌రికి షాక్ ఇచ్చింది.

Pranitha Subhash

ప్ర‌ణీత పెళ్లికి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు ఆమె పెళ్లి జ‌రిగింద‌నే విషయం ఎవ‌రికి తెలియ‌దు. అయితే మ్యారేజ్ స‌డెన్‌గా ఫిక్స్ చేయ‌డం వ‌ల‌న ఎవ‌రికి చెప్ప‌లేద‌ని పేర్కొంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్ర‌ణీత తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ.. గూగుల్‌పై మండిప‌డింది. గూగుల్‌లో ఒక్కోసారి త‌లాతోక లేని స‌మాధానాలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. దీని వ‌లన కొంద‌రు హ‌ర్ట్ కావ‌ల‌సిన ప‌రిస్థితి కూడా ఉంటుంది. తాజాగా ఇండియాలో అత్యంత చెత్త భాష ఏది అని గూగుల్‌లో సర్చ్ చేస్తే కన్నడ అని చూపించింది. దీంతో కన్నడిగులు ఫైర్ అయ్యారు.

Pranitha Subhash

త‌న మాతృభాష‌ని కించప‌ర‌చ‌డంతో ప్ర‌ణీత కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దేశభాషల్లోకెల్లా కన్నడ అత్యంత ప్రాచీనమైంది.. ఎంతో చరిత్ర ఉందని.. క్వీన్ ఆఫ్ లాంగ్వేజ్ అని గర్వంగా చెప్పుకొచ్చారు ప్ర‌ణీత‌. విష‌యం తెలుసుకున్న‌ గూగుల్ కూడా దిగి వచ్చి కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. కాగా, ప్ర‌ణీత‌కు ఇప్పుడు క‌న్న‌డ నాట పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆహార పంపిణి చేస్తూ పేదలు, ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలబడుతూ ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకుంటుంది ప్ర‌ణీత‌.