Siri: సిరికి హీరోయిన్ ఆఫ‌ర్ ఇస్తే ఇలా చేసింద‌ని చెప్పిన బుల్లితెర న‌టుడు

Siri: ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ఎంత ఆస‌క్తిక‌రంగా సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తెగ సంద‌డి చేస్తున్నారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో 9 మంది ఉండ‌గా, వారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా నిలిచింది సిరి. షణ్ముఖ్ జస్వంత్‌తో బాగా క్లోజ్‌గా ఉంటూ.. బిగ్ బాస్ హౌస్‌లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సిరి హనుమంత్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు నటుడు నంద కిషోర్.

TheNewsQube-
heroine offer for siri2
heroine offer for siri2

నందకిషోర్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నరసింహపురం’. ఈ సినిమాలో హీరోయిన్‌గా బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు నటించిన విషయం తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 30, 2021న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా బోరింగ్‌గా సాగడంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమాలో సిరిని క‌థానాయిక‌గా తీసుకోవ‌డం వ‌ల‌న ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చాయో వివ‌రించాడు నంద కిషోర్. సిరి హనుమంత్ మంచి నటి.. ఈ సినిమాలో చాలా బాగా నటించింది. బాగా కష్టపడింది. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది . ఈ సినిమా ప్రమోషన్స్‌కి పిలిచినప్పుడు నేను రాను అని చెప్పింది. ఆమెను ఎక్కువగా ఫోర్స్ చేయాలేకపోయాం.

ఎందుకంటే తన రీజన్స్ తనకి ఉన్నాయి. ట్రైలర్‌లో కంటెంట్ తనకి నచ్చలేదని చెప్పింది. కొన్ని షాట్స్‌లో తనని సరిగా చూపించలేదని సినిమా ప్రమోషన్స్‌కి రానని చెప్పింది. ట్రైలర్‌లో చూపించిన షాట్స్‌కి సినిమాలో ఆమె క్యారెక్టర్‌కి సంబంధం లేదు. అయితే తనని అలా చూపించడం వల్ల తనపై నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అని తను ఫీల్ అయ్యింది.

దర్శకుడు ఫస్ట్ తనకి చెప్పిన క్యారెక్టరైజేషన్ ఒకటైతే చేసింది మరోటి అని చెప్పింది. అయితే దానికి ప్రమోషన్స్‌కి రాకపోవడానికి రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. ఆమెను అడగలేకపోయాను. ఒక హీరోయిన్‌గా సినిమా ప్రమోషన్స్‌కి రావడం అనేది తన బాధ్యత. దానికి ఫోర్స్ చేయలేం. మెయిల్ లీడ్ కాబట్టి తనంతట తాను వచ్చి చేస్తే బాగుండేది.

heroine offer for siri1
heroine offer for siri1

ఒక సినిమాకి మంచి పేరు వచ్చిందంటే.. అందులో హీరో, హీరోయిన్‌లే కీలకం. సినిమా ఒకసారి చూస్తే ఆమెకి తన క్యారెక్టర్‌ని దర్శకుడు ఎంత బాగా చూపించాడో అర్థం అవుతుంది. ఆమె ఇప్పటికీ సినిమా చూసి ఉండదు.. ఒకవేళ చూస్తే తన అభిప్రాయం మారొచ్చు. కేవలం ట్రైలర్ చూసి ప్రమోషన్స్‌కి నేను రాను అనడం ఏం బాగోలేద‌ని నంద కిషోర్ అన్నాడు.