Lavanya Tripathi: చ‌డి చ‌ప్పుడు కాకుండా పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధ‌మైన‌ మెగా హీరోయిన్..?

Lavanya Tripathi: కరోనా కాలం కావడంతో ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారనే విషయం కూడా ఎవరికీ తెలియడం లేదు. ఒకప్పుడు సినిమా వాళ్ళ పెళ్లి అంటే కచ్చితంగా చాలా హడావిడి ఉండేది. రెండు మూడు రోజుల పాటు పార్టీలు జరిగేవి. అలాంటిది ఎలాంటి సందడి లేకుండా గతేడాది రానా, నితిన్, కాజల్, నిఖిల్ లాంటి స్టార్స్ పెళ్లి చేసుకున్నారు. వీళ్లంతా లాక్ డౌన్ సమయంలోనే తమ తోడు వెతుక్కున్నారు. ఇప్పటికీ వైరస్ ఉదృతంగా ఉండటంతో చాలామంది సైలెంట్ గా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. నిన్నగాక మొన్న హీరోయిన్ ప్రణీత ఒక్క ముక్క కూడా చెప్పకుండా నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది.Lavanya Tripathi

ఈమె పెళ్లి ఫోటోలు బయటకు వచ్చేంత వరకు కూడా ప్రణీత పెళ్లి చేసుకుంటుంది.. అనే విషయం ఎవరికీ తెలియదు అంటే నమ్మడం కష్టమే. తెలుగులో దాదాపు 10 సినిమాలకు పైగా నటించిన ప్రణీత కన్నడలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె బాటలోనే మరో హీరోయిన్ కూడా సైలెంట్ గా పెళ్లి పీటలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఎవరో కాదు లావణ్య త్రిపాటి. అందాల రాక్షసి సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటి వరకు 20 సినిమాలకు పైగా నటించింది. ముఖ్యంగా మెగా హీరోలు ఈయనకు బాగా అవకాశాలు ఇచ్చారు.

Lavanya Tripathi

వరుణ్ తేజ్ తో మిస్టర్, అంతరిక్షం.. సాయి ధరమ్ తేజ్ తో ఇంటలిజెంట్.. అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలలో నటించింది లావణ్య. ఈ మధ్య చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈమె నిశ్చితార్థం ఎలాంటి సందడి లేకుండా జరిగిపోయిందని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అని ప్రచారం జరుగుతుంది. కెరీర్ డల్ కావడంతో చాలా రోజులుగా పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే నిజమయ్యేలా కనిపిస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే లావణ్య నోరు విప్పాల్సిందే.