Vaishnav Tej : రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మెగా మేన‌ల్లుడి చిత్రం.. నాయక‌నాయిక‌ల మ‌ధ్య రొమాన్స్ పీక్స్ అని టాక్

Vaishnav Tej : ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించిన హీరో వైష్టవ్ తేజ్. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ మూడో సినిమా ఈరోజు ప్రారంభం అయ్యింది. ఇందులో నార్త్ ఇండియన్ భామ కేతిక శర్మ హీరోయిన్ గా వర్క్ చేస్తుంది. మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టారు. మొదటి సినిమా ఉప్పెనగా ప్రేక్షకుల్లో ఎంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో వైష్టవ్ తేజ్ కు అద్దిరిపోయే ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అటు హీరోయిన్ కృతి శెట్టిని కూడా వరుస ఆఫర్స్ వరిస్తున్నాయి.

ఉప్పెన కంటే ముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించారు హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కథను రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా.. క్రిష్ తెరకెక్కించారు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అయితే ఈ సినిమా ఉప్పెన కంటే ముందే ప్రారంభం కావడం మరో విశేషం. అలాగే కింగ్ నాగార్జున, వైష్ణవ్ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికార ప్రకటన త్వరలో రానుంది.

ఇటీవల మరో సినిమాకు సైన్ చేశారు హీరో వైష్ణవ్. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ డైరెక్టర్ గిరీషయ్య తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నార్త్ ఇండియన్ హీరోయిన్ కేతిక శర్మ నటిస్తున్నారు. ఈమె ఇప్పటికే నాగశౌర్య యాక్ట్ చేస్తున్న లక్ష్య సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు ఆకాష్ పూరీ రొమాంటిక్ మూవీలోనూ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. పూర్తి రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌, కేతికాల మ‌ధ్య రొమాన్స్ పీక్స్ స్టేజ్‌లో ఉంటుంద‌ని టాక్.

Advertisement