హీరోయిన్ అశ్విని తనువూ చాలిస్తూ తన కొడుకుని ఆ హీరో చేతిలో ఎందుకు పెట్టింది..!

Admin - December 4, 2020 / 08:30 PM IST

హీరోయిన్ అశ్విని తనువూ చాలిస్తూ తన కొడుకుని ఆ హీరో చేతిలో ఎందుకు పెట్టింది..!

అశ్విని అనే పేరు చాలా మందికే తెలిసే ఉంటుంది. అప్పట్లో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే హీరోకు చెల్లెలు పాత్రలలో బాగా ఫేమస్ అయింది. దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాల్లో నటించింది. అలాగే  తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 150 సినిమాల్లో దాక నటించారు. అలాగే మొదట్లో  అశ్విని హీరోయిన్ గా చలామణి అయ్యింది. విక్టరీ వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, సూపర్‌ స్టార్‌ కృష్ణతో కొడుకు దిద్దిన కాపురం, రాజశేఖర్‌తో అమెరికా బ్బాయి రాజేంద్రప్రసాద్‌తో పూలరంగడు, స్టేషన్‌ మాస్టర్  వంటి పలు సినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అశ్విని మన తెలుగు అమ్మాయి. అశ్విని సొంత వూరు నెల్లూరు.

ashwini

సినిమా ఛాన్సుల కోసం చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. నటుడు, దర్శకుడు పార్తీబన్ ఆమెను మొదటగా పొండాటి తేవై అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. అలాగే నటుడు పార్తీబన్ తో ఆమె అనేక సినిమాలలో నటించింది. ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు అనేవి తగ్గడంతో తమిళ  సీరియల్స్ లో సైతం నటించింది.కానీ తెలుగు బుల్లి తెరపై నటించే క్రమంలో ఆమె గుండె పోటుకు గురయ్యిది. అశ్విని కేవలం 43 ఏళ్ళ వయసులోనే కన్ను మూసింది. ఇక ఆమె వ్యక్తి గత విషయాలు గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుంటే ఆమె తెలుగు సినీ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అశ్విని కి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ బాబు పేరు కార్తీక్. కానీ వ్యక్తిగత కారణాల చేత భర్తతో కొన్నాళ్ల పాటు విడిపోయి కొడుకు కార్తీక్ తో కలిసి ఒంటరిగానే జీవించింది. అయితే ఆమెకు మొదట్లో  సినిమా అవకాశం ఇచ్చిన పార్తీబన్ తో మంచి అనుబంధం ఉండేది.

అయితే భర్త నుండి విడిపోయిన కొన్నాళ్ళకు ఆమె కాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతూ వచ్చింది అశ్విని. తరువాత ఆ సమస్య కాస్త పెద్దది అయ్యి కాన్సర్ కు దారి తీసింది. కన్ను మూయడానికి ముందే క్యాన్సర్ తో ఆరోగ్యం దెబ్బతిన్నది. భర్త నుండి విడిపోయాక, చిన్న బాబుతో అశ్విని ఎన్నో కష్టాలు పడింది. కొడుకుని పోషించడానికి కూడా చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయట. చివరకు తాను తుది శ్వాస విడిచే సమయంలో తన కొడుకు కార్తీక్  ని తన ఆప్త మిత్రుడు ఆయన పార్తీబన్ చేతిలో పెట్టి కన్ను మూసింది. ఇక ఈ పార్తీబన్ మరెవరో కాదు హీరోయిన్ సీత భర్త. అశ్విని కొడుకు ఇప్పుడు పార్తీబన్ దగ్గర పెరిగి పెద్దయ్యాడు, మంచి ప్రయోజకుడు కూడా అయ్యాడు. అలాగే పార్తీబన్ కు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్లకు కూడా దగ్గరుండి కార్తీక్ నే అన్ని పనులు చూసుకున్నాడు అంట.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us