Narappa: నార‌ప్ప‌లో వెంక‌టేష్ ప‌క్క‌న న‌టించిన యువ న‌టి ఎవ‌రో తెలుసా?

Narappa: విక్టరీ వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లో శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన చిత్రం నార‌ప్ప‌. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జూలై 19నే భారతీయ ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాత్రి 10 గంటల నుండి ప్రసారం అయింది. వెంకటేష్ అభిమానులు రాత్ర‌లు మేల్కోని మ‌రీ మూవీని వీక్షించారు. ఈ సినిమా చాలా బాగా ఉందంటూ రివ్యూవ‌ర్స్ కూడా రివ్యూలు ఇచ్చేశారు.

Narappa

తమిళ సూపర్ హిట్ మూవీ “అసురన్” సినిమాను తెలుగులో “నారప్ప”గా రీమేక్ చేసారు. వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగా వ్యవహరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుండి నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానున్న మొదటి భారీ తెలుగు చిత్రం “నారప్ప” కావడం విశేషం.

నారప్ప చిత్రంలో వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి న‌ట‌న‌ల‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ముఖ్యంగా వెంక‌టేష్ అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. అయితే మూవీ రిలీజ్‌కు ముందు నుండి ఓ అమ్మాయి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇటీవ‌ల ఓ సాంగ్ విడుద‌ల చేయ‌గా, ఓ కుర్ర భామ వెంక‌టేష్ ప‌క్క‌న క‌థానాయిక‌గా న‌టించింది. దీనిపై కొంద‌రు ట్రోల్స్ కూడా చేశారు.అంత పెద్ద వ‌యస్సు ఉన్న హీరో ప‌క్క‌న ఈ అమ్మాయిని ఎలా ఎంపిక చేశారంటూ చిర్రుబుర్రులాడారు.

అసురన్‌లో మరియమ్మలా, నారప్పలో కన్నమ్మలా ఇద్దరు హీరోలతో ఆడిపాడిన ఈ నటి గురించి గూగుల్‌లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ‘నారప్ప’ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేశ్‌ ప్రేయసిగా కనిపించే ఈమె పేరు అమ్ము అభిరామి. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె చదువుకునే రోజుల్లో నుంచే సినిమాల్లో నటించింది. 2017లో వ‌చ్చిన భైర‌వ సినిమాలో మెడిక‌ల్ స్టూడెంట్‌గా క‌నిపించింది. తమిళ ‘రాచ్చసన్‌’, తెలుగు ‘రాక్షసుడు’ చిత్రాల్లో హీరో మేనకోడలి పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఎఫ్‌సీయూకే(ఫాదర్‌ ఆఫ్‌ చిట్టి ఉమా కార్తీక్‌)లోనూ ఉమ పాత్రలో అలరించింది. మణిరత్నం తెరకెక్కిస్తున్న నవరస సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తోంది. ఈ అమ్మ‌డు ఇటు తెలుగు, అటు త‌మిళంలోను వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ పోతుండ‌గా నార‌ప్ప చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించింది.