Hero Yash : లగ్జరీ కారు కొన్న హీరో యష్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకే..!
NQ Staff - June 17, 2023 / 09:05 AM IST

Hero Yash : సెలబ్రిటీలు అంటేనే లగ్జరీ లైఫ్ ను మెయింటేన్ చేస్తూ ఉంటారు. వారు ఉండే ఇల్లు దగ్గరి నుంచి మొదలు పెడితే.. తిరిగే కారు వరకు ఇలా అన్నీ కోట్లలోనే ఉంటాయి. తాజాగా యష్ కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ ను అందరికీ తెలియజేశాడు. ఆయన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
2007 లో జంబాడా హుడుగి మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. కేజీఎఫ్ సినిమాతో తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆయన నుంచి మరో అప్ డేట్ రాలేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా యష్ ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఇది రేంజ్ రోవర్. దీని ఖరీదు మార్కెట్లో రూ.4 కోట్ల వరకు ఉంటుంది. ఇండియాలో అత్యధిక ధనవంతులు, వ్యాపారవేత్తలు కొనుగోలు చేసే కారును తాజాగా యష్ కొనుగోలు చేశాడు. ఇప్పటికే యష్ దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి.
మెర్సిడెస్ బెంజ్ డీఎల్ఎస్ 350 డి, ఆడి క్యూ 7, రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్, మెర్సిడెస్ జీఎల్‌సి 250 డి కూపే లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటికి తోడుగా మరో కారును కొనుగోలు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా యష్ ను అభినందిస్తున్నారు.
Range Rover Entered ✅#YashBoss #Yash19@TheNameIsYash pic.twitter.com/erQbftMhxd
— Abhi ⚡ (@AbhiYashCult) June 15, 2023