Hero: బాధ‌ను త‌ట్టుకోలేక విప‌రీతంగా శృంగారం చేసాన‌న్న స్టార్ హీరో

Hero: ప్రముఖ హాలీవుడ్‌ హీరో, ర్యాపర్‌ విల్‌ స్మిత్ సినీ ప్రియుల‌కి చాలా సుప‌రిచితం.ఆయ‌న తాజాగా ప‌లు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. తాను 16 ఏళ్లలో ఎదుర్కొన పలు సంఘటనలు ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నాడు. 16 ఏళ్లకే తొలి బ్రేకప్‌ వంటి చేదు అనుభవాలను చూశానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

TheNewsQube-
Hero Will Smith Share his Breakup Story
Hero Will Smith Share his Breakup Story

‘అలాద్దీన్’ చిత్రంతో తెలుగువారికి విల్ స్మిత్ సుపరిచితుడే.. తెలుగులో డబ్బింగ్ అయినా ఈ చిత్రంలో విల్ స్మిత్ క్యారెక్టర్ కి వెంకటేష్ డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఆయన 16వ ఏట జ‌రిగిన కొన్ని విష‌యాలు చెప్పి అంద‌ర‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

నా 16 ఏట, మెలనియా తో ప్రేమలో పడ్డాను.. అయితే నేను మ్యూజిక్ కన్సర్ట్ కోసం పది రోజులు దూరంగా ఉండేసరికి ఆమె వేరొకరితో ఎఫైర్ పెట్టుకొంది. ఈ విషయం తెలిసి నేను బ్రేక్ చేసుకున్నా.. మొదటి ప్రేమ ఎంతో బాధను ఇస్తుంది.. ఆమెనుంచి దూరమయ్యాకా చాలా ఒత్తిడికి గురయ్యాను. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి విపరీతంగా సెక్స్ చేసేవాడిని.

అందులో ఆనందం ఉండేది కాదు.. తన మీద కోపం మాత్రమే ఉండేది. ఒక్కోసారి ఆ విపరీతమైన శృంగారం వలన వాంతులు కూడా అయ్యేవి. అప్పుడు నాకు అవేమి గుర్తొచ్చేవి కావు.. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అది నేనేనా అని అనుమానమొస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

Hero Will Smith Share his Breakup Story
Hero Will Smith Share his Breakup Story

ప్రస్తుతం విల్ స్మిత్ కింగ్ రిచర్డ్స్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. టెన్నిస్ ప్లేయర్స్‌ వీనస్, సెరెనా విలియమ్స్‌లకు తండ్రి, కోచ్‌ రిచర్డ్‌ విలియమ్స్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ మూవీకి రీనాల్డో మార్కస్ గ్రీన్ దర్శకత్వం వహిస్తున్నాడు.