మెగా ఆడపడుచుల మధ్యలో….బ్రదర్ వరుణ్ తేజ్…ఆనందమంతా అతడి ముఖంలోనే ఉందిగా…
Samsthi 2210 - December 3, 2020 / 08:10 PM IST
మెగా డాటర్ నాగబాబు తనయ నిహారిక పెళ్లి సందడి మొదలైంది. మెగా ఫ్యామిలీ అంతా ఇప్పుడు పెళ్లి హడావిడిలో ఉంది. నిహారిక- చైతన్య మరో వారంలో దాంపత్య జీవితంలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో..సంబరాలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి మెగా ఫ్యామిలీ వారసులంతా ఒక్కచోట చేరి నిహారిక, ఆమెకు కాబోయే భర్త చైతన్యకు అదిరిపోయే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో ఆరడుగుల ఆజానుబాహుడు వరుణ్ తేజ్.. చిరంజీవి కూమార్తెలు.. శ్రీజ, సుస్మిత సహా మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ ఇతర కుటుంబ సభ్యులు తెగ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి.
పార్టీలో అల్లు అర్జున్ సతీమణి స్నేహ కూడా పాల్గొన్నారు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్న చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్.. ”చైనిహారిక పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.. కుటుంబం అంతా కలిసి రాత్రి పార్టీలో ఓ రేంజ్లో ఎంజాయ్ చేశాం” అని పేర్కొన్నారు. కాకపోతే ఈ పార్టీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కనిపించకపోవడంతో అభిమానులు కాస్త వెలితిగా ఫీలయ్యారు. ఇక తాజాగా 1 గంట క్రితం హీరో వరుణ్ తేజ్ మరో ఫోటో షేర్ చేశాడు. రాత్రి జరిగిన పార్టీకి సంబంధించిన ఫోటో అని పేర్కొన్నాడు. మెగా ఆడుపడుచుల మధ్యలో హల్క్ బ్రదర్ మాదిరి స్టిల్ ఇచ్చాడు వరుణ్ తేజ్. చుట్టూ ఉన్న అక్కాచెల్లెళ్లు…అందులోనా చెల్లి నిహారిక వివాహం..వరుణ్ తేజ్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఈ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ఫోటోలలో ఇదే బెస్ట్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఆగస్టు నెలలో నిహారిక- చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటి నుంచే ఈ ఇద్దరి ఫోటోలు, పెళ్లి సంగతులు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది ఇక ఇటీవలే చైతన్య-నిహారికల పెళ్లి డిసెంబర్ 9వ తేదీన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో జరగనుందని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులంతా ఈ శుభ ముహూర్తం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు తెలిసింది. కాగా డెస్టినేషన్ వెడ్డింగ్‌కి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో అందర్నీ ఆహ్వానించనున్నారట. మరి మెగా డాటర్ నిశ్చితార్థం ఆరేంజ్ లోనే ఉండాలి కదా..!
View this post on Instagram
Pics from #NiharikaKonidela – #Chaitanya‘s Pre-Wedding Celebrations#NisChay pic.twitter.com/wgNdBNq5nJ
— BARaju (@baraju_SuperHit) December 3, 2020