Tarun: త‌ల్లి బాట‌లో ప‌య‌నిస్తున్న త‌రుణ్‌.. ఇది ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో అని అభిమానుల‌లో చ‌ర్చ‌..!

యంగ్ ల‌వ‌ర్ బోయ్‌గా అమ్మాయిల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు త‌రుణ్‌. ఒక‌ప్పుడు ఆయ‌న సినిమాలంటే యూత్‌లో మంచి క్రేజ్ ఉండేది. త‌రుణ్‌ని చూసి అమ్మాయిలు తెగ ఫిదా అయ్యేవారు. ఇలాంటి మొగుడే నాకు రావాలంటూ కలలు క‌నే వారు. రాను రాను త‌రుణ్ క్రేజ్ త‌గ్గింది. అడ‌పాద‌డ‌పా సినిమాల‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ అవి స‌క్సెస్ కాక‌పోవ‌డంతో కొత్త అవ‌తారం ఎత్తాడు. ఓ డ‌బ్బింగ్ వ‌ర్షెన్ సినిమాను తాను డ‌బ్బింగ్ చెప్పేందుకు సిద్ద‌మ‌య్యాడు త‌రుణ్‌. మలయాళం ‘అతిరన్’ మూవీని తెలుగులోకి డ‌బ్ చేస్తుండ‌గా, దీనిని ఆహా ప్లాట్ ఫాంలో రిలీజ్ చేయ‌బోతున్నారు .

ఫాహద్ ఫాజిల్ – సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ అతిర‌న్‌ను తెలుగులో అనుకోని అతిథి పేరుతో డ‌బ్ చేశారు. 1970కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందించారు డైరెక్టర్ వివేక్. మే 28 నుండి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోండ‌గా, ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన ఫాహద్ ఫాజిల్ పాత్రకు టాలీవుడ్ హీరో తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం తరుణ్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలియగానే సోషల్ మీడియాలో అటు పాజిటివ్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఒక‌ప్పుడు మంచి హీరోగా రాణించిన త‌రుణ్ ఇప్పుడు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అవుతాడా అని ఆయ‌న అభిమానులు ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారు. తరుణ్ చివరిగా ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం అయితే తరుణ్ కొత్త సినిమాలెవి ప్రకటించలేదు. కానీ డబ్బింగ్ చెప్పడనే విషయం తెలియగానే తరుణ్ కూడా తల్లి బాటలోనే వెళుతున్నాడని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తరుణ్ తల్లి రోజారమణి కూడా ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని అందరికి తెలిసిందే. ఇప్పుడు కొడుకు అదే బాటలో అడుగులు వేసే సరికి ఫ్యాన్స్ కూడా ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.