Srihari: డబ్బుని గుడ్డలో చుట‌్టి రోడ్డుపైకి విసిరేసిన శ్రీహరి

Srihari: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులున్నారు. వారిలో కొంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందితే.. మరికొంతమంది ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అలా ఎంతోమంది నటులు మన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో ముఖ్యంగా శ్రీహరి ఎంతో పేరును సంపాదించుకున్నారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, నిర్మాతగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు. మల్టీ టాలెంటెడ్ యాక్షన్ టైగర్ గా పేరు సంపాదించారు. రియల్ స్టార్ శ్రీహరి కెరీర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. తన వినూత్నమైన నటనాభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించి, అలరించారు. ఆ తర్వాత కాలంలో సినీ ప్రేక్షకులను, తన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయారు.

తన మంచి మనస్సుతో ఎంతోమంది ప్రేక్షకుల్లో ఉన్నతమైన వ్యక్తిగా నిలిచారు. శ్రీహరి కూతురు అక్షర మరణంతో ఆమె పేరుతో అక్షర ఫౌండేషన్ ను ప్రారంభించి ఎంతోమంది విద్యార్థుల్ని దత్తత తీసుకుని చదివించిన మహనీయుడు శ్రీహరి. విద్యార్థులతో పాటు కొన్ని దీనావస్థలో ఉన్న గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేశారు. అంతేనా ఎన్నో మంచి పనులు చేశారని ఎప్పటికప్పుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారని సినీ నటులు చెబుతున్నారు. రీసెంట్ గా ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీహరి గురించి తన అనుభవాలను షేర్ చేసుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు బెనర్జీ, కమెడియన్ సుదర్శన్, జ్యోతి, పృథ్వీరాజ్ లతో యాంకర్ సుమ హోస్ట్ చేసిన ప్రోగ్రామ్ లో పలువురు కొంతమంది నటీనటుల గురించి తమ అభిప్రాయాల్ని కూడా షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శ్రీహరి గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు పృథ్వీ. ఎవరైనా బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి శ్రీహరి హెల్ప్ చేసేవారని అన్నారు. ఎవరికైనా ఆత్మాభిమానం అడ్డు వస్తుందేమోనని కొంత డబ్బును, రాయికి కట్టి దాన్ని గుడ్డలో చుట్టి వారికి అందేలా రోడ్డుపైకి విసిరేసేవారట. అది తీసుకున్నవారు చేతులెత్తి దణ్ణం పెట్టేవారని, అలా ఎంతోమందికి ఎన్నో సార్లు సాయం చేసిన మహోన్నత వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు.