Siddharth: బొమ్మ‌రిల్లు హీరో సిద్ధార్థ్ భార్య‌, పిల్ల‌ల‌ని ఎప్పుడైన చూశారా..!

Siddharth: హీరో సిద్ధార్థ్ అంటే అంద‌రు ఠ‌క్కున గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు కాని బొమ్మ‌రిల్లు సిద్ధార్థ్ అంటే మాత్రం వెంట‌నే క‌నెక్ట్ అయిపోతారు. ఆ సినిమాలో ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించాడు మ‌రి. తండ్రి చాటున ఎదిగిన కొడుకులా సిద్ధార్థ్ న‌ట విన్యాసం ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో న‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత సిద్ధార్థ్ తెలుగులో ప‌లు సినిమాలు చేశాడు. అందులో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ‌ట్ అయ్యాయి. అయితే ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమాల‌కు చాలా దూరంగా ఉంటూ వ‌స్తున్న సిద్ధార్థ్ మ‌హా స‌ముద్రం చిత్రంతో తిరిగి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్ఎక్స్100 చిత్ర దర్శకుడు “అజయ్ భూపతి” దర్శకత్వం వ‌హిస్తున్న మ‌హా స‌ముద్రంలో సిద్దార్థ్.. శ‌ర్వానంద్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇటీవ‌ల ఆయ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Hero siddharth family

సిద్ధార్థ్ వ‌య‌స్సు నాలుగు ప‌దుల దాటినా కూడా ఇంకా పెళ్లి కాని కుర్రాడిలానే కనిపిస్తుంటాడు. అయితే ఈయ‌న‌కు గతంలో పెళ్లి జ‌రిగింద‌నే విష‌యం కొద్ది మందికే తెలుసు. 2003వ సంవత్సరంలో న్యూఢిల్లీలో తన పొరుగింట్లో నివాసం ఉంటున్న మేఘన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో 2007లో విడాకులు తీసుకున్నారు. అయితే వీరికి మొగ్లీ అనే కుమారుడు ఉండ‌గా, ఆ బాలుడి బాధ్య‌త‌ను సిద్ధార్థ్ తీసుకున్నాడు. ఇక అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు సిద్ధార్థ్ మ‌ళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు కాని పలువురు టాలీవుడ్ హీరోయిన్లతో లవ్ అఫైర్లు మాత్రం బాగానే నడిపాడు.

Hero siddharth familyఇప్పుడు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్దింటి ఫ్యామిలీ కోడ‌లిగా ఉన్న హీరోయిన్‌తోను అప్పుడు సిద్ధార్థ్ ప్రేమ‌యాణం న‌డిపాడు. ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగారు. పెళ్లి పీట‌లు ఎక్కేందుకు కూడా సిద్ధ‌మ‌య్యారు. కాని ఏమైందో ఏమో ఇద్దరి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో స‌ప‌రేట్ అయ్యారు. అయితే ఈ మ‌ధ్య సిద్ధార్థ్ బీజేపీపై నిప్పులు చెరుగుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. తన కుటుంబసభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని కామెంట్స్ చేస్తూ తమిళనాడు బీజేపీ నేతలతో పాటు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను కూడా ఆయన టార్గెట్ చేశారు. తేజస్విని సిద్ధార్థ్ టెర్రరిస్టుతో పోల్చ‌డంతో సిద్ధార్థ్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధార్థ్ ..నేను అసలైన భారతీయుడిని. సక్రమంగా పన్నులు కడుతున్నాను. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్య‌వ‌హారం సౌత్‌లో చాలా హాట్ టాపిక్‌గా మారింది.

vishnu vs Siddharth