Hero Rohith: ఈ హీరో గుర్తు ప‌ట్ట‌కుండా ఇలా మారాడేంటి ?

Samsthi 2210 - July 31, 2021 / 03:28 PM IST

Hero Rohith: ఈ హీరో గుర్తు ప‌ట్ట‌కుండా ఇలా మారాడేంటి ?

Hero Rohith: ఒక‌ప్పుడు ప్రేమ క‌థా చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన హీరో రోహిత్. 6 టీన్స్‌, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, నేను సీతామాలక్ష్మి వంటి సినిమాల‌తో అల‌రించిన రోహిత్ శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో రోగి పాత్ర పోషించి అల‌రించాడు. అయితే న‌వ‌వ‌సంతం సినిమా ఆయ‌న‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

12345

శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `కళాకార్‌` అనే సినిమాలో రోహిత్ హీరోగా న‌టిస్తున్నాడు. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు.

ఫ‌స్ట్ లుక్ రిలీజ్ స‌మ‌యంలో రోహిత్ లుక్ చూసి చాలా మంది షాక‌య్యారు. అప్ప‌టికీ ఇప్ప‌టికీ గుర్తు ప‌ట్ట‌కుండా ఉన్నాడు రోహిత్. ఇతను రోహిత్ అంటే ఎవ‌రు న‌మ్మలేక‌పోయారు. క‌ళాకార్ చిత్రంతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్న రోహిత్ ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుందని ఆశిస్తున్నాడు. క‌ళాకార్ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలకపాత్రల్లో నటించారు.

క‌ళాకార్ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ లాంచ్ స‌మ‌యంలో మాట్లాడిన రోహిత్‌.. హీరో శ్రీ‌కాంత్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న‌తో ఎప్ప‌టినుంచో నాకు మంచి అనుభందం ఉంది. నేను ఫస్ట్‌ టైమ్‌ యాక్ష‌న్ అండ్ స‌స్పెన్స్ స‌బ్జెక్ట్‌తో చేస్తోన్న చిత్ర‌మిది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌. సినిమా చాలా బాగా వచ్చింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికి న‌చ్చుతుందని అన్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌తేదిని ప్ర‌క‌టిస్తామని అన్నారు. చిత్రంలో రోహిత్ ఒక డిఫ‌రెంట్ లుక్‌లో కనిపిస్తారు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వ‌చ్చిందని ద‌ర్శ‌కుడు అన్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us